Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

10th Examination Centers Near Student Home .. !



విద్యార్ధుల ఇంటి దగ్గరలోనే 10వ తరగతి పరీక్ష కేంద్రాలు.. !
కరోనా నేపథ్యంలో జూలై 10 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలలో పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. విద్యార్థుల మధ్య కనీసం 4 అడుగుల భౌతిక దూరం ఉండేలా పరీక్ష గదులను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పరీక్ష కేంద్రాల సంఖ్యను భారీగా పెంచాల్సిన అవసరం ఏర్పడింది. మారిన పరిస్థితుల్లో విద్యార్థుల నివాస ప్రాంతానికి సమీపంలోనే పరీక్ష కేంద్రాలు కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో ఉండే విద్యార్ధులు ఎక్కడ పరీక్ష రాస్తారో అన్న విషయమై ఈ నెల 25లోగా ఆప్షన్ లు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం 14 కాలమ్ తో కూడిన ప్రొఫార్మాను తయారుచేసి పంపించింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా ప్రైవేట్ విద్యాసంస్థల హాస్టళ్లలో ఉంటూ పదో తరగతి పరీక్షలు రాయాల్సిన విద్యార్థులకు ఎస్ఎస్ సీ బోర్డు పరీక్ష కేంద్రం ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు తమ సొంత గ్రామాలలో ఉన్నారు. సొంత గ్రామాలలో ఉన్న విద్యార్థులు వారి మండలం పరిధిలోని పరీక్ష కేంద్రంలో పరీక్ష రాస్తారా? లేక తాను చదువుకున్న స్కూలు సమీ పంలోని కేంద్రంలో పరీక్ష రాస్తారా? అన్న ఆప్షన్ ఇచ్చింది. జిల్లా విద్యాధికారుల ద్వారా ఈ సమాచారాన్ని సేకరిస్తున్నారు.
Furnishing of the option of the students regarding the place of examination centre related
Rc.No.151/B-2/2019, Dated: 18-05-2020

Previous
Next Post »
0 Komentar

Google Tags