కొత్తగా 8 గిరిజన
గురుకుల కాలేజీలు
సాక్షి, అమరావతి:
రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీలు ఏర్పాటు
చేసేందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రతిపాదనలు తయారుచేసింది. వీటిని వచ్చే విద్యా
సంవత్సరం నుంచి ప్రారంభించాలని భావిస్తోంది. అయితే కొత్త కాలేజీలకు ప్రభుత్వ ఆమోదం
లభించాల్సి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో భామిని, మెలియాపుట్టి,
విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మర్రిపాలెం, చింత
పల్లి మండలం లో తిగెడ్డ, తూర్పుగోదావరి జిల్లా చింతూరు,
పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు, గుంటూరు
జిల్లా బొల్లాపల్లి, నెల్లూరు జిల్లా ఓజిలి గ్రామాల్లో కొత్త
కాలేజీలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
* ఒక్కో కాలేజీలో మొదటి సంవత్సరంలో 160 మంది,
రెండో సంవత్సరంలో మరో 160
మందిని చేర్చుకుంటారు. ఇవన్నీ బాలికల కాలేజీలు కావడం విశేషం.
* ప్రస్తుతం ఉన్న
గిరిజన గురుకుల పాఠశాలల్లో ఆరు స్కూళ్లను అప్ గ్రేడ్ చేసి
జూనియర్ కాలేజీలుగా మారుస్తారు. ఇవి కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి
ప్రారంభంకానున్నాయి.
*శ్రీకాకుళం జిల్లా మల్లి, విజయనగరం జిల్లా కొమరాడ,
విశాఖపట్నం జిల్లా మారికవలస, చిత్తూరు జిల్లా
రేణిగుంటలలో బాలురకు, ఎస్సార్ జిల్లా రాయచోటి, అనంతపురం జిల్లా తనకల్లులో అప్ గ్రేడెడ్ కాలేజీలు బాలికల కోసం ఏర్పాటు
చేస్తారు.
0 Komentar