పదోతరగతి పరీక్షలకు
అదనపు కేంద్రాలు
*వ్యక్తిగత దూరం
పాటిస్తే రెట్టింపు
కానున్న కేంద్రాలు
ఈ ఏడాది
రాష్ట్రంలో 6.39 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా, ఇందుకోసం 2,925 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వ్యక్తిగత
దూరం పాటిస్తూ పదో తరగతి పరీక్షల నిర్వహించాలి అనే నిర్ణయం ప్రస్తుతం ఒక్కో తరగతి
గదిలో 24 మంది విద్యార్థులు పరీక్ష రాసే అవకాశం ఉండగా,
దానిని 12కు కుదించాలి. బెంచ్‌కి ఇద్దరుకు
బదులు బెంచ్‌కి ఒక్క విద్యార్థి మాత్రమే పరీక్ష రాసేలా చర్యలు చేపట్టాలి. దీనికోసం
ప్రస్తుతం గుర్తించిన పరీక్ష కేంద్రాలు దాదాపు రెట్టింపు అవసరమవుతాయి. ప్రతి తరగతి
లోనూ విద్యార్థుల మధ్య దూరం కనీసం ఆరు అడుగులు ఉండేలా అధికారులు ప్రతిపాదనలు
రూపొందించారు.
దూరం పాటిస్తూ
పరీక్షలు నిర్వహించేందుకు ఎన్ని కేంద్రాలు కావాలనే వివరాలను పంపాలని డీఈవోలను
ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రస్తుతం గుర్తించిన కేంద్రాల్లోనే సర్దుబాటు చేయడం, సమీపంలోనే
మరో పాఠశాలలో కేంద్రం ఏర్పాటు, కొంత దూరంలో ఏర్పాటుపై
పరిశీలించాలని సూచించారు. ఈ వారంలో పరీక్ష కేంద్రాలను గుర్తించి డీఈవోలు పాఠశాల
విద్యాశాఖ కమిషనరేట్‌కు వివరాలు పంపించనున్నారు. ప్రతి బెంచిపై ఒక విద్యార్థి
కూర్చునేలా చూస్తున్నారు. పదో తరగతి విద్యార్థులు 6.39 లక్షల
మంది ఉండగా వీరికి గతంలో 2,925 కేంద్రాలను కేటాయించారు.
కేంద్రాలు మారితే మరలా హాల్‌టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో అందుకు తగినంత
మంది సిబ్బందిని కూడా నియమించుకోవాల్సిన అవసరం ఉంది.
షెడ్యూల్‌పై
తప్పుడు ప్రచారం: మంత్రి
పదో తరగతి
పరీక్షల షెడ్యూల్‌పై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తమని పరీక్షల
షెడ్యూల్‌ను ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు
సురేష్ తెలిపారు.
0 Komentar