Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Andhrapradesh School Education Regulatory and Monitoring Commission rules

Andhrapradesh School Education Regulatory and Monitoring Commission Rules


School Education Department– The Andhra Pradesh School Education Regulatory and Monitoring Commission Rules, 2020 – Notification- Issued.
G.O.MS.No. 28 Dated: 28-05-2020
వసతులు లేని & అధిక ఫీజులు వసూల్లు చేసే స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలకు ముకుతాడు
రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు తమ వివరాలను జూన్‌ 9 సాయంత్రం 5 గంటల లోపు www.apsermc.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి.
అడ్డగోలు ఫీజుల వసూళ్ళకు ఇక చెల్లవు...
జస్టిస్‌ ఆర్‌.కాంతారావు నేతృత్వంలోని ఈ కమిషన్‌ పాఠశాల విద్యలో ప్రమాణాల పెంపుతోపాటు, పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో నిబంధనల మేరకు సదుపాయాలుండేలా చర్యలు చేపట్టింది. స్కూళ్లు నిర్ణీత ఫీజులు మాత్రమే వసూలు చేసేలా కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకు సంబంధించి మంగళవారం నోటిఫికేషన్‌ కూడా ఇచ్చింది. 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఫీజులను నిర్ధారించనుంది. ఇందుకోసం యాజమాన్యాలు తప్పనిసరిగా తమ వివరాలను కమిషన్‌కు సమర్పించాలి. లేకపోతే ఆ సంస్థలకు ఫీజు వసూలుకు అనుమతి ఉండదు.
> అన్ని ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు ఫీజుల ప్రతిపాదనలకు సంబంధించిన సమాచారాన్ని కమిషన్‌ వెబ్‌సైట్‌కు ఆన్‌లైన్‌ ద్వారా నిర్ణీత ఫార్మాట్లో షెడ్యూళ్లలో సమర్పించాలి. ఇందుకు జూన్‌ 9 వరకు గడువిచ్చారు. యాజమాన్యాల ప్రతిపాదనలు, ఇతర వివరాల ఆధారంగా ఫీజులను నిర్ణయిస్తారు.
>మొదటి త్రైమాసికానికి సంబంధించిన ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలి.
>అధిక ఫీజులు వసూలు చేసినా, కాలేజీలు, స్కూళ్లు తెరవకుండానే ఫీజులు వసూలు చేసినా చర్యలు తప్పవు.
> ప్రతి ప్రయివేటు అన్‌ ఎయిడెడ్‌ స్కూలు, కాలేజీ తమ సంస్థల భవనాలు, తరగతి గదులు, ల్యాబ్‌లు ఇతర సదుపాయాలను జియో ట్యాగింగ్‌ యాప్‌ ద్వారా కమిషన్‌ వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాలి.
ఈ సదుపాయాలుండాల్సిందే..
>ఇంటర్మీడియెట్‌బోర్డు దరఖాస్తుతో పాటు సదుపాయాలపై సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాలని స్పష్టంచేసింది.
>కాలేజీ భవనం, తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీ, ఆటస్థలం తదితరాల ఫొటో ఇమేజ్‌లను జియో ట్యాగింగ్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాలి.
>బోర్డు వాటన్నిటినీ పరిశీలించి, ప్రజలకు తెలిసేలా పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచుతుంది. సదుపాయాలు లేనట్లుగా గుర్తిస్తే చర్యలు తీసుకుంటుంది.
>అదనపు సెక్షన్లకు వీలుగా ఆర్‌సీసీ భవన వసతి, అదనపు తరగతులకు గదులు ఉండాల్సిందే.
>భవనపు రిజిస్టర్డ్‌ లీజ్‌ డీడ్, సొంత భవనమైతే సంబంధిత రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లు, ఆటస్థలం కూడా ఉండాలి.
>అనుమతి ఉన్న భవన నిర్మాణ ప్లాన్, ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికేట్, శానిటరీ, స్ట్రక్చరల్‌ సౌండ్‌నెస్‌ సర్టిఫికేట్‌లతో పాటు సంబంధిత అధికారవర్గాల నిరభ్యంతర పత్రాలను కాలేజీలు బోర్డు పరిశీలనకు సమర్పించాల్సి ఉంటుంది.
>పార్కింగ్‌ స్థలం, బోధన, బోధనేతర సిబ్బంది వివరాలు, వారి అర్హతలకు సంబంధించిన వివరాలనూ సమర్పించాలి.
>కాలేజీ, పాఠశాల గుర్తింపు వివరాలు, సెక్షన్లు , బిల్డింగ్‌ వివరాలు , గత ఏడాది ఫీజుల వివరాలు , ఉద్యోగుల వివరాలు , కిచెన్‌ హాస్టల్‌ వివరాలు, వచ్చిన ఫీజులు. ఖర్చుల వివరాలు , ఇతర డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేసేలా నిబంధనలు విధించారు.


తేది. 28.05.2020 నాటి సాక్షి దినపత్రిక సౌజన్యంతో..
Previous
Next Post »
0 Komentar

Google Tags