అనేక జాగ్రత్తలతో
ఆగస్టు 3 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో
పాఠశాలలను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. విద్యా సంవత్సరం పై
ఇటీవల మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లభిప్రాయాలను
సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆగస్టు నుంచి ఏప్రిల్ 30
వరకు విద్యా సంవత్సరం ఉండాలని పని దినాలను
220 నుంచి 200కు తగ్గించాలని
ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సూచించారు. వారి సూచనలను పరిగణనలోకి తీసుకున్న సీఎం
వైఎస్ జగన్ ఆగస్టు మూడు నుంచి పాఠశాలలను ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులను
ఆదేశించారు. ఈ నేపధ్యంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ..
‘రాష్ట్రంలో ఆగష్టు 3 నుంచి పాఠశాలలను
ప్రారంభించడానికి అన్ని రకాల చర్యలను పకడ్బందీగా చేపట్టామని మంత్రి పేర్కొన్నారు.
ఈ నేపధ్యంలో పాఠశాల
విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు గారు ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు చేశారు.
వాటిలో ముఖ్యమైనవి..
*స్కూళ్లు
పునఃప్రారంభించేందుకు 'స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్
అనుసరించాలి. కోవిడ్-19 ప్రభావం పిల్లల మానసిక, శారీరక పరిస్థితిపై పడకుండా జాగ్రత్తపడాలి.
*స్కూల్లో
ప్రధాన గేట్ మొదలుకొని అన్నిటిని పూర్తిగా డిస్ ఇన్ఫెక్ట్ చేయాలి.
*విద్యార్థులు
లోపలకు వచ్చే ముందు శారీరక ఉష్ణోగ్రత పరిశీలించాలి.
*ప్రవేశ
ప్రదేశంలోనే ప్రతి 30 మంది విద్యార్థులకు చేతులు శుభ్రం
చేసుకొనేందుకు రెండు ఆటోమేటెడ్ హేండ్ వాష్ కేంద్రాలు పెట్టాలి.
*విద్యార్థులు,
టీచర్లకు వాష్ బుల్ మాస్కులు అందించాలి. హేండ్ కర్చీఫ్లు తప్పనిసరి.
*మధ్యాహ్న
భోజనం కార్యక్రమంలో పాల్గొనే టీచర్లు, సిబ్బంది మాస్కులు,
గ్లోజ్ లను వాడటం తప్పనిసరి.
*ఉదయం
ఆరు బయట అసెంబ్లీని రద్దుచేసి తరగతి గదుల్లో స్పీకర్ల ద్వారా నిర్వహించాలి.
* 30 మంది మాత్రమే ఉండే స్కూళ్లలో గదికి 15మంది చొప్పున
ఉదయం 8 నుంచి 12 వరకే తరగతులు
నిర్వహించాలి.
* తరగతికి
30 మందికన్నా ఎక్కువ మంది విద్యార్థులుంటే ఉదయం 8 నుంచి 12.30 వరకు ఒక షిప్ట్ , ఆ తరువాత 12.30 నుంచి 4.30
వరకు రెండో షిప్ట్ నిర్వహించాలి.
* 50 నుంచి 100 మంది ఉంటే రెండు బ్యాచ్ లుగా రోజు విడిచి
రోజు స్కూలు నడపాలి.
*ఇంటిదగ్గర
అభ్యసించేందుకు వర్కు బుక్స్ అందించాలి.
* నీరు
తాగేందుకు, భోజనానికి 10 మంది చొప్పున
క్యూలో వెళ్లేలా గంట మోగించాలి.
* ప్రతి
రోజూ కరోనా జాగ్రత్తలపై విద్యార్థులకు 15 నిమిషాలు వివరించి
వారి సమీప ప్రాంతాల్లో కోవిడ్ కేసులున్నాయేమో తెలుసుకోవాలి.
*యోగాను
ఎవరికి వారు చేసేలా బోధించాలి.
* పరీక్షల
సమయంలో హాలకు 10 మంది మాత్రమే ఉండేలా చూడాలి.
*కోవిడ్
లక్షణాలు కనిపించే పిల్లలను ప్రత్యేక ఐసోలేషన్ గదులలో పరీక్ష రాయించాలి. వాటిని
పరీక్షకు ముందు, తరువాత డిస్ ఇన్ఫెక్ట్ చేయించాలి.
తేది. 20.05.2020 నాటి సాక్షి దినపత్రిక సౌజన్యంతో..
0 Komentar