Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP DEECET-2020 NOTIFICATION DETAILS

AP DEECET-2020 NOTIFICATION DETAILS

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ
DEECET- 2020 కోసం ప్రకటన
నోటిఫికేషన్ నం. 1/DEECET 2020, తేది: 18.05.2020
2020-2022 విద్యా సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (DIETS) లో మరియు ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూషన్స్ లో ఆఫర్ చేసిన రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) కోర్సులో ప్రవేశానికి అభ్యర్థుల ఎంపిక కోసం ఆన్‌లైన్ ద్వారా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (DEECET-2020) కోసం ఆన్‌లైన్లో దరఖాస్తులు కోరబడుచున్నవి. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే https://cse.ap.gov.in & https://apdeecet.apcfss.in నుండి 21.05.2020 నుండి 08.06.2020 వరకు దరఖాస్తు చేయవలెను. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల దాఖలు కోసం అర్హతా ప్రమాణాలు మరియు మార్గదర్శకాలతో సహా వివరమైన సమాచార బులెటిన్ పైన తెలిపిన వెబ్ సైట్ నుండి 21.05.2020 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చును. మాన్యువల్ దరఖాస్తులు ఏ రూపంలోనూ స్వీకరించబడవు.
Notification
DOWNLOAD
Information Bulletin
DOWNLOAD
Official website
CLICK HERE
డీఎడ్‌ ప్రవేశానికి డీఈఈ సెట్‌..
చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పడంపై కొందరు అమితమైన ఆసక్తి చూపుతారు. ఇలాంటి వారు ప్రాథమిక విద్యాబోధనలో డిప్లొమా కోర్సు పూర్తిచేసుకోవడం ద్వారా తమ ఆశయాన్ని నెరవేర్చుకోవచ్చు. ప్రభుత్వ ఆధ్వర్యంలో డైట్‌లు, వివిధ ప్రైవేటు సంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఇంటర్‌లో చదివిన గ్రూప్‌, పరీక్ష రాయడానికి ఎంచుకున్న మాధ్యమం ప్రకారం డీఎడ్‌ కోర్సును సంబంధిత భాషలో పూర్తి చేసుకోవచ్చు. డీఈఈ సెట్‌లో సాధించిన మార్కులు, రిజర్వేషన్లు అనుసరించి సీట్ల కేటాయింపులుంటాయి. ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ ఆధ్వర్యంలో డైట్‌లు నడుస్తున్నాయి. ఇవి కాకుండా ఎయిడెడ్‌, మైనార్టీ, ప్రైవేటు సంస్థలు డీఎడ్‌ కోర్సు అందిస్తున్నాయి. ఇందులో కనీస అర్హత మార్కులు (35) సాధించడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు లభిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాల ప్రకటన వెలువడినప్పుడు సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వంద మార్కుల ప్రశ్న పత్రంలో రెండు పార్టులు ఉంటాయి.
పార్ట్‌-ఎ లో 60, పార్ట్‌- బిలో 40 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. పార్ట్‌- ఎలో టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ 5, జనరల్‌ నాలెడ్జ్‌ 5, ఇంగ్లిష్‌ 5, తెలుగు 5, ఆప్షనల్‌ లాంగ్వేజ్‌ (తెలుగు, ఇంగ్లిష్‌, తమిళం, ఉర్దూల్లో ఏదో ఒకటి) 10, మ్యాథ్స్‌ 10, జనరల్‌ సైన్స్‌ 10, సోషల్‌ స్టడీస్‌ 10 ప్రశ్నలు వస్తాయి. సబ్జెక్టు, లాంగ్వేజ్‌ ప్రశ్నలన్నీ 6 నుంచి పదో తరగతి సిలబస్‌లో ఉన్న అంశాల నుంచే వస్తాయి.
పార్ట్‌- బి అభ్యర్థి ఇంటర్‌లో చదివిన గ్రూపు, ఎంచుకున్న విభాగం బట్టి మారుతుంది. మ్యాథ్స్‌/ ఫిజికల్‌ సైన్స్‌/ బయాలజీ/ సోషల్‌ స్టడీస్‌లో 40 ప్రశ్నలు ఇంటర్‌ సిలబస్‌ నుంచి అడుగుతారు. మ్యాథ్స్‌ తీసుకున్నవారికి మొదటి ఏడాది నుంచి 20, రెండో సంవత్సరం సిలబస్‌ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. ఫిజికల్‌ సైన్స్‌ ఎంచుకుంటే ఫిజిక్స్‌ నుంచి 20, కెమిస్ట్రీ 20 ప్రశ్నలు అడుగుతారు. బయాలజీ వారికి బోటనీ 20, జువాలజీ 20 ప్రశ్నలు ఉంటాయి. సోషల్‌ స్టడీస్‌ లో హిస్టరీ, ఎకనామిక్స్‌, సివిక్స్‌ ఒక్కో సబ్జెక్టు నుంచి 13 లేదా 14 ప్రశ్నలు చొప్పున మొత్తం 40 ఉంటాయి. పరీక్ష తెలుగు, ఇంగ్లిష్‌, తమిళం, ఉర్దూ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. అభ్యర్థి నచ్చిన మాధ్యమం ఎంచుకోవచ్చు.

సీట్ల కేటాయింపు: ఏపీలో ఇంటర్‌లో చదివిన గ్రూపుల వారీ డైట్లలో సీట్లు కేటాయిస్తారు. మ్యాథ్స్‌, ఫిజికల్‌ సైన్స్‌, బయలాజికల్‌ సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ ఒక్కో విభాగానికి 25 శాతం చొప్పున సీట్లు లభిస్తాయి. మ్యాథ్స్‌, ఫిజికల్‌ సైన్స్‌ సీట్లకు ఎంపీసీ; బయలాజికల్‌ సైన్స్‌ సీట్లకు బైపీసీ, సోషల్‌ స్టడీస్‌ సీట్లకు సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపుల వారు పోటీపడవచ్చు.

Previous
Next Post »

1 comment

  1. D.Ed. entrance books to prepare the exam please in English medium

    ReplyDelete

Google Tags