'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్యాకేజీ: ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు భారీ ప్రోత్సాహం
*ఆన్‌లైన్
కోర్సుల అమలుకు 100 వర్సిటీలకు అనుమతి
*స్కూళ్ల
డిజిటలైజేషన్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
'ఆత్మ నిర్భర్
భారత్ అభియాన్' ప్యాకేజీలో ఇవాళ
ఆఖరి విడత కేటాయింపులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ
సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. విద్యావిధానంలో టెక్నాలజీతో సమూల మార్పులు
తీసుకొస్తున్నామన్నారు. స్వయం ప్రభ ఛానెల్ ద్వారా ఇప్పటికే ఆన్ లైన్ పాఠాలు
చెబుతున్నారని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ చదువుకుంటున్న 1-12 తరగతుల విద్యార్థుల
కోసం మరో 12 ఛానెళ్లను ప్రారంభిస్తున్నామని, బధిరుల
కోసం ప్రత్యేక ఈ-క్లాస్‌లు ఉంటాయని వెల్లడించారు. డి.టి.హెచ్ ల ద్వారా ఆన్ లైన్
విద్య బోధిస్తామన్నారు. విద్యా ప్రసారాల కోసం 4 గంటల ఎయిర్
టైమ్ కేటాయించామని, ఈ స్కూల్ లో 200
కొత్త పుస్తకాలిస్తామన్నారు. ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య టెక్నాలజీ వారధిలా..
వినూత్న బోధనా విధానానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఆన్‌లైన్ కోర్సుల అమలుకు 100 వర్సిటీలకు అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు. మనో దర్పణ్ స్కీమ్ ద్వారా
విద్యార్థులకు, టీచర్లకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్టు
తెలిపారు.
0 Komentar