నిమ్మకాయ
మన దైనందిన
జీవితంలో నిమ్మకాయ అవసరం చాలా ఉంది. అలాగే నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిది. నిమ్మకాయలను
తరచూ మనం వంటకాల్లో ఉపయోగిస్తుంటాం. దీని రసంతో పులిహోర లేదంటే నిమ్మకాయలతో
పచ్చడి చేసుకుని తినడం మనకు అలవాటు. చర్మ సౌందర్యానికి నిమ్మకు మించినది
లేదు.
నిమ్మకాయ వల్ల
కలిగే లాభాలు
*నిమ్మరసంలోని
విటమిన్ ‘సి’ గల ఏంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
జలుబు చేసినవారికి ఇది చాలా మంచిది.
*జీర్ణశక్తిని
పెంపొందిస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తీసుకున్న ఆహారంలోని పోషకాలు
శరీరానికి వంటబట్టేటట్టు చూస్తుంది.
*మలబద్ధకము, అజీర్ణం,
అగ్నిమాంద్యం మొదలగు జీర్ణక్రియ వ్యాధుల్లో ప్రతీరోజూ రెండు పూటలా
నిమ్మరసం త్రాగితే జీర్ణరసాలు చక్కగా ఊరుతాయి. ఆకలి పెరిగి, బరువు
హెచ్చుతుంది.
* ఫ్లూ జ్వరం, దగ్గు,
జలుబు వంటి సమస్యలు పోతాయి.
*ఎండాకాలంలో 1
గ్లాసు మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు, కొంచెం పటిక
బెల్లం కలుపు కుని తాగుతుంటే వడదెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చు.
*ఒక నిమ్మకాయ
రసానికి 10 రెట్ల నీళ్లు కలిపి పడుకునేముందు తాగుతుంటే మలబద్దకాన్ని పోగొట్టి, విరేచనం
సాఫీగా అయ్యేట్టు చూస్తుంది.
*కురుల
ఆరోగ్యానికి నిమ్మకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది చుండ్రు నివారిణి.
* బాక్టీరియా, శిలీంధ్రాల
నాశినిగా నిమ్మకాయ పనిచేస్తుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ ను రాకుండా చేస్తుంది.
*సున్నిపిండి
మరపట్టించుకునేటప్పుడు కొన్ని ఎండిన నిమ్మ తొక్కలు కూడా కలిపి మరపట్టుకుంటే చర్మం
కాంతివంతంగా తయారవుతుంది.
*నిమ్మరసం
వేడినీటిలో కలిపి సేవిస్తే కాలేయం శుభ్రపరుస్తుందని భావిస్తారు.
*దీనిలోని కొన్ని
పదార్ధాలు కేన్సర్ రాకుండా నిరోధిస్తాయి.
*మన లివర్‌లో
బైల్ యాసిడ్స్ బాగా రిలీజయ్యేలా చేస్తుంది. అది కొలెస్ట్రాల్ అంతు చూస్తుంది. ఊబకాయం తగ్గుతుంది.
*చుండ్రు, మొటిమలు,
మొదలగు చర్మవ్యాధులకు నిమ్మరసాన్ని రెండు మూడుసార్లు రోజూ
సేవించాలి. లాభం ఉంటుంది.
*ముఖంమీద ముడతలను, మృతకణాలను
ఇది తొలగిస్తుంది. జిడ్డు చర్మాన్ని మాపడానికి దీనికి మించిన మందు లేదు.
*ఒక గ్లాస్ వేడి
నీటిలో నిమ్మరసాన్ని రోజూ తాగుతుంటే దాంతో శరీరంలో పొటాషియం లెవల్స్, సిట్రేట్
స్థాయిలు కూడా మెరుగు పడతాయి. దీంతో నెమ్మదిగా కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి.
*క్రమం తప్పకుండా
ఆ నీటిని తాగుతుంటే గాల్ బ్లాడర్ సమస్యలు రావు.
*రక్త సరఫరా
మెరుగుపడి గుండె సంబంధ సమస్యలు కూడా రావు.
* మధుమేహం ఉన్నవారు
నిమ్మరసాన్ని తాగుతుంటే దాంతో వారి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి.
మధుమేహం అదుపులో ఉంటుంది.
*నిమ్మకాయ
తొక్కల్లో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. అది కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
*నిమ్మ రసంలో
ఉండే విటమిన్ల కంటే నిమ్మతొక్కలో ఎక్కువ విటమిన్లు ఉంటాయని శాస్త్రవేత్తలు
చెబుతున్నారు.
*నిమ్మకాయ నుంచి
రసం తీశాక ఆ తొక్కతో చర్మాన్ని క్లీన్ చేసుకోవచ్చు. దీని వల్ల శరీరానికి హానిచేసే
ట్యాక్సిన్లు అంతమవుతాయి.
* నిమ్మతొక్కతో
ముఖాన్ని రబ్ చేస్తే మట్టి తొలగిపోవటంతో పాటు చర్మం కాంతివంతమవుతుంది.
0 Komentar