వేసవి సీజన్లో
లభించే వాటిలో తాటి ముంజ కూడా ప్రధానమైనది. దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. రుచితో
పాటు ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ముంజులు
ఎంతో ఉపయోగపడతాయి. గ్రామాల్లో ఇవి విరివిగా లభ్యమౌతాయి. ఇటీవల కొంతమంది నగరాల్లో
కూడా విక్రయిస్తున్నారు.
తాటి ముంజలు - ఆరోగ్య
ప్రయోజనాలు
1.తాటి ముంజుల్లో
విటమిన్ ఏ, బీ, సీ, ఐరన్,
కాల్షియంతోపాటు బి కాంప్లెక్స్, నియాసిస్,
రిబో ప్లెవీస్, దయామిన్, జింకు పాస్పరస్, పొటాషియం తదితర పోషకాలు కూడా ఉంటాయి.
2. వేసవిలో
ఎక్కువగా వచ్చే డీ హైడ్రేషన్, అలసట, చర్మ
సమస్యలతో ఇబ్బందిపడేవారికి తాటి ముంజులు మంచి ఔషదం.
3. ఆరు
అరటిపండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజలో ఉంటుంది.
4.
కాలేయ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ముంజుల్లోని పొటాషియం శరీరంలో ఉండే విష
పదార్ధాలను తొలగిస్తాయి.
5.
వంద గ్రాముల తాటి ముంజుల్లో కేవలం 43 గ్రాముల కేలోరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి తాటి
ముంజులు తింటే బరువు పెరుగుతామనే భయం కూడా అక్కర్లేదు.
6.
దద్దుర్లు, కాలిన గాయాలు, చేమట కాయలు
ఏర్పడినట్లతే తాటి ముంజుల గుజ్జుని శరీరానికి పట్టిస్తే కొద్ది రోజుల్లోనే
తగ్గిపోతాయి.
7. ఇవి బీపీని అదుపు చేయడమే కాకుండా కొవ్వును కంట్రోల్ చేస్తుంది.
8.
క్యాన్సర్ కణాల నిరోధానికీ ముంజులు ఉపయోగపడతాయి, రొమ్ము
క్యాన్సర్‌కు కారణమయ్యే పెట్రో కెమికల్స్, ఆంథోసైనిన్‌లను
నిర్మూలిస్తాయి.
9.
అజీర్తి, ఎసిడిటీ సమస్యలు కూడా దూరం అవుతాయి.
10. ఎముకులను బలంగా ఉంచేందుకు, వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు
ముంజులు చాలా మంచివి.
0 Komentar