సీబీఎస్‌ఈ ‘పది’
పరీక్షలు రద్దు
దేశవ్యాప్తంగా
సీబీఎస్‌ఈ పదో తరగతి విద్యార్ధులకు పరీక్షలు రద్దు చేస్తున్నట్లు కేంద్ర మానవ
వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ
మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు. నిన్న
విద్యార్ధులతో వీడియో మాధ్యమం ద్వారా మాట్లాడిన కేంద్ర మంత్రి.. పరీక్షల రద్దు
విషయాన్ని తెలియజేశారు.
ఈఏడాది విద్యా సంవత్సరంలో పాఠ్యాంశాల సిలబస్ తగ్గించనున్నట్లు మంత్రి తెలిపారు. అయితే ఈ లాక్ డౌన్ వల్ల విద్యార్థులు ఎంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపారు. వారిపై ఒత్తిడి తగ్గించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

అయితే నార్త్ - ఈస్ట్ దిల్లీ
విద్యార్ధులకు మాత్రం ఈ మినహాయింపు వర్తించదు. వీరికి పరీక్ష నిర్వహించే ముందు పది
రోజుల గడువు ఇస్తామని కేంద్రమంత్రి ట్వీట్ చేశారు.
0 Komentar