జూలైలో స్కూళ్లు, కాలేజీలపై
నిర్ణయం- కేంద్రం
కేంద్రం స్కూళ్లు, కాలేజీలు,
ఇతర విద్యాసంస్థలను తిరిగి తెరవడంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
తీసుకుంది. పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు
తెరిచే అంశం రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని
కేంద్రం ప్రకటించింది. విద్యాసంస్థలు, పేరెంట్ కమిటీలతో
దీనికి సంబంధించి చర్చలు జరపాలని కేంద్రం పేర్కొంది. వారి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్
ఆధారంగా జూలై నెలలో స్కూళ్లు, కాలేజీలను తెరవడంపై నిర్ణయం
తీసుకోనున్నట్లు కేంద్రం ప్రకటించింది. విద్యాసంస్థల
పునఃప్రారంభం విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ వేరుగా మార్గదర్శకాలు ఇవ్వనున్నది.
0 Komentar