100 రోజుల స్కూల్స్ వైపు కేంద్ర ప్రభుత్వ ఆలోచన
కరోనా నేపథ్యంలో
వచ్చే విద్యా సంవత్సరం నుండి పలు మార్పులకు కేంద్రం సిద్ధమవుతోంది.
సరికొత్త ప్రణాళికతో విద్యావ్యవస్థ నిర్వహణకు ప్రభుత్వం వ్యూహాలు రచిస్తున్నట్లు
నిపుణులు చెబుతున్నారు. అందులో భాగంగా పలు ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తుండగా..
పాఠశాలల పనిదినాలను 100రోజులకు కుదించడంపై దృష్టి సారించింది.
రాబోయే విద్యా
సంవత్సరంలో స్కూళ్లకు 100 రోజుల పనిదినాలు, 600 గంటల తరగతి బోధనకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని ప్రభుత్వం
వర్గాలు తెలిపాయి. అలాగే విద్యార్థికి
ఇంట్లోనే ఆన్‌లైన్ బోధనతో 100 రోజులు, 600 అభ్యాస గంటల విద్యా ప్రణాళికను ప్రభుత్వం రచిస్తున్నట్లు నిపుణులు
విశ్లేషిస్తున్నారు.
ఇప్పటివరకు 220 పనిదినాలు ఉండగా.. వాటిని 100 రోజులకు కుదించడంతో పాటు
మరో 20రోజులు విద్యార్థి మానసిక వికాసాన్ని పెంచే విధంగా
డాక్టర్లు, కౌన్సెలర్లతో ప్రేరణ కలిగించే కార్యక్రమాలు
చేపట్టాలని భావిస్తోందట. ఆన్‌లైన్ సౌకర్యాలు లేని విద్యార్థులపై స్కూల్ యాజమాన్యాలు దృష్టి పెట్టాలని హెచ్‌ఆర్‌డీ
మంత్రిత్వ శాఖ సూచించింది.
0 Komentar