అనుమతి ఉన్న
ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల
వరకు దుకాణాలు
ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్రెడ్డి కోవిడ్–19 నియంత్రణ చర్యలు,
లాక్డౌన్ అనంతరం రాకపోకలపై అనుసరించాల్సిన విధానాలపై ఆదివారం తన
నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర
ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలను తెరిచేందుకు
అనుమతించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం
మాట్లాడుతూ కరోనాపై ప్రజల్లో భయాన్ని పోగొట్టాలని, భౌతిక దూరం లాంటి జాగ్రత్తలపై
అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అలాగే విదేశాలనుండి వారికి ప్రభుత్వం ఏర్పాటు
చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉచితంగానే అన్ని వసతులు కల్పించేలా చర్యలు చేపట్టాలని
సీఎం సూచించారు.వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారు హోం క్వారంటైన్ పాటించేలా చేయడం,
పరీక్షలు, వైద్య సదుపాయాలు, ఆస్పత్రికి తరలించడం లాంటి కార్యక్రమాలు కొనసాగేలా చూడాలని సీఎం
ఆదేశించారు.
0 Komentar