COVID-19 Andhra Pradesh APP
‘కోవిడ్–19 ఏపీ’ యాప్‌తో ఇంటి వద్దే కరోనా పరీక్షలు
ఎవరికైనా జ్వరం, దగ్గు,
జలుబు వంటి కరోనా వైరస్ లక్షణాలుంటే ‘కోవిడ్–19 ఏపీ’ మొబైల్ యాప్ లో పేరు నమోదు చేసుకుంటే ఇంటి వద్దకే వైద్యులు వచ్చి
పరీక్షలు నిర్వహించడం ద్వారా కరోనా ఉందో లేదో చెప్పే వినూత్న ప్రక్రియకు రాష్ట్ర
ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఈ యాప్ ఎలా పని
చేస్తుంది ?
‘కోవిడ్–19 ఏపీ’ యాప్‌లో సంబంధిత వ్యక్తి పేరు, ఆ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయనే దానికి సమాధానాలు ఇవ్వాలి. ఈ
సమాచారం వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల పరిశీలనలోకి వెళుతుంది.
సంబంధిత వ్యక్తికి గల లక్షణాలను బట్టి
ఏఎన్‌ఎం లేదా మెడికల్ ఆఫీసర్ ఇంటి వద్దకే వస్తారు. లక్షణాలను పరిశీలించిన
తర్వాత కరోనా పరీక్షలు అవసరమో లేదో నిర్ధారించి అవసరమైతే అక్కడే చేస్తారు. టెస్టులు
అవసరం లేదనుకుంటే వ్యాధి తీవ్రతను బట్టి మందులు సూచిస్తారు. అలాగే ఈ యాప్‌లో మన ఇంటికి సమీపంలో ఉండే నర్సులు,
డాక్టర్ల వివరాలు అందుబాటులో ఉంటాయి.
COVID-19 Andhra Pradesh APP
0 Komentar