టీచర్ల ఇంటి వద్దనే సీబీఎస్ఈ 10, 12
తరగతుల మూల్యాంకనం..
కరోనా వైరస్
నేపథ్యంలో తమ పబ్లిక్ పరీక్షల సమాధాన పత్రాలు టీచర్లకిచ్చి వారి ఇళ్ల వద్దే
మూల్యాంకనం చేయించేలా ఏర్పాట్లు చేయాలని ఆ శాఖ పరిధిలోని కేంద్రీయ సెకండరీ
ఎడ్యుకేషన్ బోర్డు (సీబీఎస్‌ఈ) నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నిర్వహించే 2020 పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని టీచర్ల ఇళ్ల వద్దే
చేయించనుంది. సీబీఎస్‌ఈ పదో తరగతిలో మిగిలి ఉన్న పేపర్లకు, 12 తరగతుల పరీక్షలకు సంబంధించి ఇటీవలే సీబీఎస్‌ఈ షెడ్యూల్ విడుదల చేసిన
సంగతి తెలిసిందే.. జూలై ఒకటో తేదీ నుంచి 12 వరకు ఇవి
జరుగుతాయి. వీటి సమాధాన పత్రాలను టీచర్లతో వారి ఇళ్ల వద్దే మూల్యాంకనం చేయించేలా చర్యలు
చేపట్టినట్టు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌పోఖ్రియాల్ నిశాంక్
ఆదివారం మీడియాతో చెప్పారు. మొత్తం 1.50 కోట్ల పరీక్ష
పత్రాలను ఎగ్జామినర్ల ద్వారా ఇళ్ల వద్దే దిద్దించాల్సి ఉంటుంది.
0 Komentar