తెలంగాణలో “మే”
నెల పూర్తి జీతంపై ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు
ఏపీ ప్రభుత్వం
పూర్తి జీతాలు ఇచ్చేందుకు సిద్ధపడటంతో, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులంతా తమకు కూడా
పూర్తి స్థాయి జీతాలు ఇస్తే బాగుండని ఎదురుచూస్తున్నారు. ఏపీ తరహాలో తెలంగాణలో
కూడా పూర్తి జీతాలు ఇచ్చే అవకాశాలున్నాయంటూ ఉద్యోగులు గంపెడాశతో
ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో పూర్తి జీతాలపై సీఎం కేసీఆర్ నిర్ణయం కోసం
ఎదురుచూస్తున్నారు. అయితే తెలంగాణ ఆర్థిక శాఖ పూర్తి జీతాలు ఇచ్చే ఉద్దేశంతో లేదని
తెలుస్తోంది. ఏప్రిల్‌లో ఎలా ఇచ్చారో... మే లోనూ అలాగే ఇచ్చేందుకు రెడీ
అవుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం మాత్రం మార్చి, ఏప్రిల్
బకాయి జీతాలు, పెన్షనర్లకు చెల్లించాల్సిన సగం పెన్షన్
బకాయిల చెల్లింపును త్వరలోనే చేపట్టేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని తెలిసింది.
Its a systematic wealthy state. No need to ask.
ReplyDelete