టీచర్ల బదిలీలకు
కసరత్తు వేగవంతం: పదోన్నతుల వివరాలు కోరిన ప్రభుత్వం
రాష్ట్రంలో
ఉపాధ్యాయుల బదిలీలకు చేపట్టిన కసరత్తును విద్యాశాఖ వేగవంతం చేసింది. ఎనిమిదేళ్ల పాటు
ఒకేచోట పని చేసిన ఉపాధ్యాయులంతా విధిగా కదలాల్సిందేనంటూ ఇప్పటికే విద్యాశాఖ
మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో హెచ్.ఆర్.ఏ కేటగిరీ వారీగా ఖాళీల
వివరాలను కోరగా, తాజాగా, గత ఏడాది నవంబరు నుంచి ఈ
సంవత్సరం మార్చి వరకు నెలవారీ చేపట్టిన పదోన్నతుల వివరాలను కూడా అందజేయాలని విద్యాశాఖ
సర్యులర్ జారీ చేసింది. సబ్జెక్టు టీచర్స్ వారీగా పదోన్నతుల వివరాలను ప్రొఫార్మ తెలపాలని
సర్క్యులర్ లో ఆయన పేర్కొన్నారు.
0 Komentar