10వ
తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ వైఖరి కోరిన ఏ.పి.హైకోర్టు
రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులను
ఎస్ఏ-1 పరీక్ష మార్కులు / గ్రేడింగ్ ఆధారంగాపై తరగతికి పంపేలా ఆదేశాలు జారీ
చేయాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. కాకినాడకు
చెందిన సొసైటీ ఫర్ బెటర్ లివింగ్ అధ్యక్షుడు టి.భవాని ప్రసాద్ ఈ పిల్ దాఖలు
చేశారు. దీనిపై బుధవారం న్యాయమూర్తులు జస్టిస్ శేషసాయి, జస్టిస్ బి.కష్టమోహన్ తో కూడిన
ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంపై ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలని హైకోర్టు
కోరింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్, ప్రభుత్వ
పరీక్షల డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు
చేయాలని ఆదేశించిన హైకోర్టు విచారణను జూన్ 24 కి వాయిదా
వేసింది.
0 Komentar