తెలంగాణా సీఎం
కేసీఆర్ మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అంశాలను నిన్న రాత్రి విలేకరుల సమావేశంలో
వెల్లడించారు...
ముఖ్యాంశాలు
*రాష్ట్రంలోని
కంటైన్మెంట్ ఏరియాలు తప్ప మిగతా మొత్తం ప్రాంతాన్ని గ్రీన్‌జోన్‌గా
ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.
* హైదరాబాద్
మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచే
రోడ్డెక్కుతాయని తెలిపారు.
* అన్ని రకాల
వ్యాపార సముదాయాలు తెరుచుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు.
*కరోనాతో ఇక కలసి
సహజీవనం చేయాల్సిన గత్యంతరంలేని పరిస్థితి నెలకొందని వివరించారు.
*కంటైన్మెంట్
జోన్లు తప్ప రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, కార్లు, ట్యాక్సీలు, క్యాబ్‌లు, ప్రైవేటు
వాహనాలకు అనుమతి.
*జిల్లాల మధ్య
ప్రైవేటు బస్సులు, స్టేజీ కార్యరియర్లు, వ్యక్తిగత వాహనాలు, ఆటోలు, కార్లు
కూడా నడుస్తాయి.
*క్యాబ్‌లలో
డ్రైవర్ కాకుండా ముగ్గురు ప్రయాణికులను అనుమతిస్తామని, ఆటోల్లో
డ్రైవర్ కాకుండా ఇద్దరు మాత్రమే ఎక్కాలని వెల్లడించారు. దీన్ని అతిక్రమిస్తే కఠిన
చర్యలు తీసుకుంటామన్నారు.
*అందరూ కచ్చితంగా
మాస్కులు ధరించాలని, మాస్కు లేకుండా బయటకు వచ్చిన వారికి రూ.
వెయ్యి జరిమానా విధిస్తామన్నారు.
*65 ఏళ్ల పైబడ్డ
వృద్ధులు,
చిన్నపిల్లలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం కావాలని
కేసీఆర్ సూచించారు.
* ఆహారం వండి హోం
డెలివరీ చేసేందుకు రెస్టారెంట్లకు అనుమతి
*హైదరాబాద్
మెట్రో రైల్ సర్వీసులకు అనుమతి లేదు.
*కంటైన్మెంట్
ఏరియాల పరిధిలోని కుటుంబాల వారికి కావాల్సిన నిత్యావసరాలను డోర్ డెలివరీ తరహాలో
ప్రభుత్వమే సరఫరా చేస్తుందని కేసీఆర్ తెలిపారు.
*హైదరాబాద్‌లో
కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నందున సిటీ బస్సులను మాత్రం అనుమతించట్లేదని, అలాగే
అంతర్రాష్ట్ర బస్సులకు కూడా అనుమతి ఇవ్వట్లేదన్నారు.
*కంటైన్మెంట్
జోన్లు తప్ప అన్ని ప్రాంతాల్లో హెయిర్ కటింగ్ సెలూన్లు, ఈ–కామర్స్ సముదాయాలు.
*ప్రభుత్వ, ప్రైవేటు
కార్యాలయాల్లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు. పరిశ్రమలు, తయారీరంగ
యూనిట్లలో పూర్తిస్థాయిలో పనులు.
*అన్ని
విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు, ప్రార్థనా మందిరాలు, ఉత్సవాలు, ఫంక్షన్
హాళ్లు, మాల్స్, సినిమా హాళ్లు. బార్లు,
పబ్బులు, క్లబ్బులు, స్టేడియాలు,
పార్కులు, స్విమ్మింగ్‌పూళ్లు, జిమ్‌లు, అమ్యూజ్‌మెంట్
పార్కులు అన్నీ మూత
*రాత్రి 7 గంటల
నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ
కొనసాగనుంది.
0 Komentar