విద్యాశాఖ మంత్రి
'శ్రీ ఆదిమూలపు సురేశ్ 'గారు & ఉన్నతాధికారులతో ఉపాధ్యాయ సంఘాల నాయకుల వీడియో కాన్ఫరెన్స్
ముఖ్యాంశాలు...
ఆంధ్రప్రదేశ్
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు, రాష్ట్ర విద్యా శాఖ అధికారులు
శ్రీ సుబ్బారెడ్డి గారు, శ్రీ ప్రతాప్ రెడ్డి గారు మరియు ఇతర
ఉన్నతాధికారులతో ఈరోజు సంఘ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్
లో పదవ తరగతి పరీక్షల పై, 2020-21 విద్యా సంవత్సరం అకడమిక్
క్యాలెండరు, ఇంకా అజెండాలో లేకున్నా బదిలీలపై వివిధ సంఘాల నాయకులు పాల్గొని సలహాలు
సూచనలు ఇవ్వడం జరిగింది.
1) ప్రస్తుత COVID 19 నేపథ్యంలో పదవతరగతి పరీక్షలు FA1, FA 2, FA3,
FA4 మరియు SA 1 మార్కుల ఆధారంగా పాస్ చేయాలని
సూచించడమైనది.
2) ఒకవేళ
పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలంటే physical distance ఉండేలా ఏ
స్కూలు ఆ స్కూల్ లోనే (Self center) సెంటర్గా
ఏర్పాటుచేసి రాష్ట్రంలో విద్యార్థి ఎక్కడ
చదువుతున్న వారు ఏ సెంటర్లో కోరుకుంటే లేదా ఏ సెంటర్ వద్ద నివాసము ఉంటే ఆ సెంటర్లో
రాసే విధంగా చర్యలు తీసుకోవాలి.
3) అలాగే ప్రతి గదికి కేవలం 12 మంది విద్యార్థులు ఉండేలా రూములు ఏర్పాటు చేయాలని, పాఠశాలల్లో రూములు చాలకపోతే అదే ఊరిలో ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు సెంటర్లు గా ఏర్పాటు చేయాలి.
3) అలాగే ప్రతి గదికి కేవలం 12 మంది విద్యార్థులు ఉండేలా రూములు ఏర్పాటు చేయాలని, పాఠశాలల్లో రూములు చాలకపోతే అదే ఊరిలో ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు సెంటర్లు గా ఏర్పాటు చేయాలి.
4) Spot ను జిల్లా అంతటా ఒకేచోట కాకుండా
కనీసం 3 చోట్ల జరపాలి. ఏ జిల్లా Scripts ను ఆ జిల్లాలోనే value చేయాలి (Division మార్చి దిద్దాలి). ఇంటర్మీడియెట్
లాగా పరీక్ష ముగిసిన వెంటనే సంభందిత సబ్జెక్ట్ Spot పారంభం
కావాలి. త్వరితగతిన Spot పూర్తి అయ్యేటట్లు ప్రైవేట్ ఉపాద్యాయులను కూడా SPOT కు
వినియగించాలి. లేదా ఉపాద్యాయుల ఇంటివద్దనే స్పాట్ వాల్యుయేషన్ చేయించి తిరిగి
పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా విద్యాశాఖకూ చేరే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించడమైనది.
5) Pass marks ను 35 నుండి 25 కు తగ్గించాలి.
6) పిల్లలు
భద్రత దృష్ట్యా భౌతిక దూరం పాటించాలి
కావున SSC center's సంఖ్యను రెట్టింపు
చేయాల్సి వస్తుంది. అందరికి furniture provide చెయ్యడం కష్ట
సాద్యం కావున Furniture కంటే విద్యార్థుల ఆరోగ్యానికి అధిక
ప్రాధాన్యత ఇవ్వాలి.
7)
పరీక్ష విధులు నిర్వర్తించే వారికి తగు జాగ్రత్తలు చేపట్టాలి. 50 సంవత్సరాల వయస్సు
దాటిన ఉపాధ్యాయులకు పరీక్ష విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
8) ప్రతి రోజూ పరీక్ష సెంటర్లు శుభ్రం చేయాలని, విద్యార్థుల కు మాస్క్ లు,శానిటైజర్స్ అందించాలని తెలియజేయడం జరిగింది.
8) ప్రతి రోజూ పరీక్ష సెంటర్లు శుభ్రం చేయాలని, విద్యార్థుల కు మాస్క్ లు,శానిటైజర్స్ అందించాలని తెలియజేయడం జరిగింది.
9)
పాఠశాల అకాడమిక్ ఇయర్ ఆగస్టులో ప్రారంభించి దసరా సెలవులలో సగం దినాలు, సంక్రాంతి సెలవుల్లో సగం దినాలు తగ్గించడం (రెండవ శనివారం ఆదివారాలు
తప్పనిసరిగా సెలవు ఉండాలి), ఏప్రిల్ 30 వరకు పాఠశాలను కొనసాగించాలి.
10) అలాగే అవసరమైతే విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోట
షిఫ్ట్ పద్ధతుల్లో తరగతులు నిర్వహించవచ్చు అని
తెలియజేయడం జరిగింది.
11) అదేవిధంగా
పాఠశాలల్లో విద్యార్థులు పెరిగిన చోట టీచర్లు లేరు ఇటువంటి పాఠశాలలు
గుర్తించి అరవై దాటిన ఇటువంటి ప్రతి
ప్రాధమిక పాఠశాలలో ఐదుగురు టీచర్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం
జరిగింది.
12)
అలాగే పాఠశాల పనిదినాలు 220 నుండి కోవిడ్ నేపథ్యంలో 200 లకు తగ్గించాలి. అలాగే
సిలబస్ను తగ్గించాలి.
13)
బదిలీలు ఆన్లైన్ ద్వారా నిర్వహించి (పాఠశాల ప్రారంభం లోపల), రేషనలైజేషన్
గతంలో లాగా కాకుండా 1:20 or 1: 25 విధానంలో నిర్వహించాలని
కోరడమైనది.
14) మార్చి లో
కమీషనర్ గారు ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చలు ఆధారంగా ప్రభుత్వం హైకోర్టు కు
వెళ్లి సర్వీస్ రూల్స్ పై స్టాటిస్కో రద్దు చేయించాలని, ఈలోగా
డిప్యూటీ డీఈవో ఎంఈఓ పోస్టులకు సీనియర్ ప్రధానోపాధ్యాయులను ఎఫ్ ఏ సి ద్వారా నియమించాలి అని కోరడం
జరిగింది.
చివరగా
మంత్రిగారు మాట్లాడుతూ సంఘాలు ఇచ్చిన
ప్రతిపాదనలు అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు...
గమనిక: ఇది కేవలం ఆయా సంఘాలు ప్రభుత్వం దగ్గర వెలిబుచ్చిన అభిప్రాయాలు
మాత్రమే. పైన తెలిపిన విషయాలపై ప్రభుత్వం ఇంకనూ ఎటువంటి
నిర్ణయం తీసుకోలేదు.
0 Komentar