లాక్‌డౌన్ 4.0: 31 మే వరకు లాక్‌డౌన్ పొడిగింపు...
లాక్‌డౌన్ 4.0 పై కేంద్ర హోం శాఖ విడుదల
చేసిన మార్గదర్శకాల కోసం క్రింద చూడండి.
కరోనా కేసులు
పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను
మే 31 వరకూ పొడిగించింది. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే
మహారాష్ట్ర, తమిళనాడు లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకూ
పొడిగించాయి. తెలంగాణలో మే 29 వరకూ లాక్‌డౌన్ ఉంటుందని
గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
లాక్‌డౌన్ 4.0
మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర హోం శాఖ
మే 31 వరకూ
మెట్రో,
విమాన సేవలు అందుబాటులో ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా హాట్‌స్పాట్స్
లో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు మే 31 వరకూ మూసివేసే
ఉంటాయని స్పష్టం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు మే 31 వరకూ
తెరిచేందుకు అనుమతి లేదని కేంద్రం తేల్చి చెప్పింది. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, జిమ్ సెంటర్లు, స్విమింగ్ పూల్స్, బార్లు, ఆడిటోరియంలు,
అసెంబ్లీ హాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు
మే 31 వరకూ తెరిచే పరిస్థితి లేదని కేంద్రం ప్రకటించింది. మే 31 వరకూ.. ప్రతిరోజూ
రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది.
లాక్‌డౌన్ మార్గదర్శకాలు
0 Komentar