జూన్ రెండోవారంలో
ఇంటర్ ఫలితాలు..!
రాష్ట్ర
వ్యాప్తంగా ఇంటర్ మూల్యాంకనం తుది దశకు చేరుకున్నది. మరోవైపు ఇంటర్మీడియట్
పరీక్షా ఫలితాలు జూన్ రెండోవారంలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో
ఈ సంవత్సరం దాదాపు 10.62 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు
రాశారు. గత నాలుగేళ్లుగా ఫస్టియర్, సెకండియర్ పరీక్షల
ఫలితాలు ఒకేసారి విడుదల చేస్తున్న ఇంటర్ బోర్డు, ఈ ఏడాది వేరు
వేరు గా విడుదలచేయాలని భావిస్తోంది. జూన్ 12న ఇంటర్ ప్రథమ, జూన్ 15న ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదలయ్యే అవకాశం ఉన్నది.
0 Komentar