పెరగనున్న జేఈఈ అడ్వాన్స్డ్
పరీక్షా కేంద్రాలు..!
కరోనా ఇబ్బందుల
దృష్ట్యా విద్యార్థులు సమీపంలోనే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేలా ఐఐటీ దిల్లీ
నిర్ణయించింది. దీనితో వచ్చే ఆగస్టు 23న నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్
కు పరీక్షా కేంద్రాలు పెరగనున్నాయి. దీనికి అనుగుణంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను
నిర్వహించే టీసీఎస్ ఆయాన్ చర్యలు చేపడుతోంది.
ప్రస్తుతం ఏపీలో
పరీక్షలు జరిగే పట్టణాలు విజయనగరం, విశాఖపట్టణం, కాకినాడ, రాజమహేంద్రవరం,
ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం,
విజయవాడ, గుంటూరు, చీరాల,
ఒంగోలు, నెల్లూరు, తిరుపతి,
కడప, అనంతపురం, కర్నూలు లకు
అదనంగా టీసీఎస్ కు అనుకూలంగా ఉండే మరికొన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాలను ఎంపిక చేయవచ్చు.
తెలంగాణలో
హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం , మహబూబ్ నగర్,
కోదాడలతో పాటు సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, మహబూబాబాద్ లను పరిశీలించే అవకాశం ఉంది.
0 Komentar