రిలయన్స్ జియో తన
ప్లాట్ ఫాం మీద జియో మీట్ అనే వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ను లాంచ్ చేసింది. ఫ్రీప్లాన్‌లో
ఐదుగురు వినియోగదారులు, బిజినెస్
ప్లాన్‌లో 100 మంది యూజర్ల వరకు జియో మీట్ పాల్గొనే అవకాశాన్ని కల్పించనుంది.
జియో మీట్ చాలా
ప్రత్యేకతను కలిగి ఉందని, ఇది ఏ పరికరంలోనైనా, ఏ
ఆపరేటింగ్ సిస్టమ్ లోనైనా పని చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని రిలయన్స్ జియో
ఇన్ఫోకామ్ సీనియర్ విపి పంకజ్ పవార్ వెల్లడించారు. జియోమీట్‌ను స్మార్ట్‌ఫోన్,
ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ఇలా ఏ యాప్‌లో అయినా యాక్సెస్ చేయొచ్చు. ఈ యాప్‌ను గూగుల్
ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మైక్రోసాఫ్ట్ విండోస్ మార్కెట్‌ప్లేస్ నుంచి, మ్యాక్ యాప్
స్టోర్ నుంచి జియోమీట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరో ముఖ్య విషయం
ఏమిటంటే వీడియో కాన్ఫరెన్సింగ్‌కు మాత్రమే జియో మీట్ పరిమితం కాదు. జియో ఇ-హెల్త్,
ఇ-ఎడ్యుకేషన్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లతో దీన్ని
అనుసంధించారు. దీని ద్వారా వినియోగదారులు వర్చ్యువల్ గా వైద్యులను సంప్రదించడానికి,
ప్రిస్క్రిప్షన్లను పొందడానికి, మందులను
ఆర్డర్లు ఇవ్వడానికి ఉపయోపడుతుంది. ఇంకా
వర్చువల్ తరగతి గదులు, రికార్డ్ సెషన్లు, హోంవర్క్ లు, పరీక్షలను నిర్వహించడం లాంటి వాటికోసం
ఇ-ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫాం సహాయపడుతుంది. తమ జియో మీట్ బహుళ ప్లాట్‌ఫామ్‌లను ఏకీకృతం
చేస్తుందనీ, నావిగేట్ చేయడం
కూడా చాలా సులభం కనుక దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చని పవార్
చెప్పారు.
0 Komentar