మిడతల దండు నెక్స్ట్
టార్గెట్.. తెలుగు రాష్ట్రాలే?
మిడతలదండు దాడిపై వీడియో కధనం క్రింద ఉన్నది గమనించగలరు.కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ మిడతల దండు వణికిస్తోంది. దేశంలోని 5 ఉత్తరాది రాష్ట్రాల్లో పంటలను మిడతలు నాశనం చేస్తున్నాయి. కోట్లలో వలస వచ్చిన మిడతలను ఎలా వదిలించుకోవాలో అక్కడి రైతులకు తెలియడం లేదు. తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి పాకిస్థాన్.. అక్కడ్నుంచి రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, యూపీలో పంటలను ఈ మిడతలు తినేయగా, జూన్/జూలైలో ఇవి తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చే ఛాన్సుంది. వీటిని అలాగే వదిలేస్తే పంటనష్టం, దుర్భిక్షం తప్పదని ఇతర దేశాల్లోని పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
మిడతలు ఎంత
డేంజరో తెలుసా?
>గుంపులుగా
దండెత్తితే పైరు ఆనవాళ్లు కూడా కనిపించవు.
>రోజులో 150
కి.మీ వరకు ప్రయాణిస్తాయి.
>కి.మీ పరిధి
గల ప్రాంతాన్ని 8 కోట్ల మిడతలు ఆక్రమించగలవు.
>35 వేల
మందికి సరిపోయే ఆహారాన్ని ఒక్క రోజులో తినేస్తాయి.
>ఒక్కో మిడత
రోజుకు తన బరువుకు సమానమైన ఆహారాన్ని తినేస్తుంది.
>వాటిలో
సంతానోత్పత్తి చాలా వేగంగా జరుగుతుంది.
>మిడతలు మూడు
నెలల్లో తమ సంతతిని 20 రెట్ల వరకు పెంచుకుంటాయి.
0 Komentar