‘మన
పాలన–మీ సూచన’ పేరుతో ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మేధోమథన సదస్సుల్లో భాగంగా మంగళవారం ‘వ్యవసాయం, అనుబంధ’ రంగాలపై
సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొన్ని
అంశాలపై మాట్లాడారు. వాటిలోని ముఖ్యాంశాలు..
>రైతు, రైతు
కూలీల్లో చిరునవ్వు చూడటమే మనలక్ష్యం.
>ఈ ఏడాది
రైతులకు ఉచితంగా పంట బీమా ఇవ్వనున్నట్లు తెలిపారు.
>రైతు భరోసా కింద
రూ.12500 ఇస్తామని మాట ఇచ్చినా.. రూ.13500లకు పెంచాం. నాలుగేళ్లకు బదులు ఐదేళ్లు
రైతు భరోసా అందిస్తాం.
>రైతుభరోసా
కింద రైతులకు ఇప్పటికే రూ.7500 ఇచ్చాము. మిగిలినవి అక్టోబర్ లో రూ.4000, సంక్రాంతి
సమయంలో మరో రూ.2000 ఇస్తాము.
>రైతులకు
వైఎస్‌ఆర్ సున్నావడ్డీ పథకాన్ని అమల్లోకి తెచ్చాం.
>రైతులకు
ఉచితంగా బోర్లు వేయిస్తాం.
> వ్యవసాయం
లాభసాటిగా మార్చడమే లక్ష్యము.
> రైతుభరోసా కేంద్రాల
(ఆర్‌బీకే) ద్వారా నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అందిస్తాం.
>వ్యవసాయానికి
అవసరమైన సూచనలు, సలహాలు కూడా రైతుభరోసా కేంద్రాలు అందిస్తాయి.
>ఆర్‌బీకేల
ద్వారా ఈక్రాపింగ్ విధానాన్ని అమలు చేస్తాం.
>పంటలు
వేయడానికి ముందే గిట్టుబాటు ధరలను ప్రకటిస్తాం.
>వచ్చేఏడాది
చివరికల్లా గ్రామాల్లో జనతా బజార్లు ఏర్పాటు చేస్తాం.
>రైతులు
పండించే 30% పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఆ పంటలను ప్రభుత్వం జనతా
బజార్లలో విక్రయిస్తుంది.
>రాష్ట్ర, జిల్లా,
మండలస్థాయిలో వ్యవసాయ బోర్డులు ఏర్పాటు చేస్తాం.
>దళారీ
వ్యవస్థను తొలగించేందుకు ఆర్‌బీకేల ద్వారా విప్లవాత్మక మార్పులుతీసుకువచ్చాం.
0 Komentar