రూ. 1000 దాటితే
ఆరోగ్య శ్రీ వర్తింపు : జులై 8న మరో 6 జిల్లాల్లో
వర్తింపు - సీఎం జగన్
ఆరోగ్య శ్రీ
విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రోగానికి సంబంధించి ఖర్చు రూ. 1000 దాటితే..వారికి కూడా ఆరోగ్య శ్రీ వర్తింప చేస్తామని సీఎం జగన్
ప్రకటించారు. 2020, జులై 08వ తేదీన ఆరు
జిల్లాల్లో వర్తింపు చేస్తామని, మిగిలిన 6 జిల్లాలో దీపావళి, నవంబర్ 14
నుంచి అమలు చేయనున్నామని ప్రకటించారు. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్
ప్రాజెక్ట్ అమలు జరిగిందని, 2 వేలకు పైగా జబ్బులకు ఆరోగ్యశ్రీ
వర్తింపు చేస్తున్నామన్నారు.
‘మన
పాలన - మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాలపై సీఎం
జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్..మాట్లాడుతూ...
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత..రూ. 5 లక్షల లోపు
ఆదాయం ఉన్న వారిని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చామని మరోమారు చెప్పారు. 1.42
కోట్ల కుటుంబాలు ఆరోగ్య పరిధిలోకి వచ్చినట్లు తెలిపారు. YSR ఆరోగ్య ఆసరా కార్యక్రమం ద్వారా చికిత్స తీసుకున్న అనంతరం రోగి రెస్ట్
తీసుకొనే సమయంలో నెలకు రూ. 5 వేలు ఇవ్వడం జరుగుతోందన్నారు.
0 Komentar