6 ఈఎంఐలు వాయిదా
వేస్తే 16 ఈఎంఐలు ఎక్కువ కట్టాల్సి రావచ్చు...
RBI అన్ని టర్మ్ లోన్ల ఈఎంఐలపై మరో మూడు నెలలు మారటోరియం పొడిగించిన సంగతి
తెలిసింది. ఈఎంఐలు వాయిదా వేస్తే మీ లోన్ ఔట్ స్టాండింగ్‌పై వడ్డీ చెల్లించాల్సి
ఉంటుంది. ఈఎంఐలు వాయిదా వేస్తే ఎంత నష్టమో క్రింది ఊదాహరణలతో తెలుసుకోండి.
ఏఏ లోన్లపై
మారటోరియం ప్రభావం ఎలా ఉంటుందో చూడండి..
Home Loan: ఓ వ్యక్తి రూ.30 లక్షల హోమ్ లోన్ తీసుకున్నాడని అనుకుందాం. ఇంకా 15 ఏళ్లు
ఈఎంఐలు చెల్లించాలి. ఆ వ్యక్తి మొదట మూడు నెలలతో పాటు మరో మూడు నెలలు మారటోరియం
ఎంచుకున్నాడు. ఔట్‌స్టాండింగ్‌పై సుమారు రూ.4,54,000 వడ్డీ చెల్లించాలి. ఇది 16
ఈఎంఐలు అదనంగా చెల్లించాలి. ఒకవేళ ఆ వ్యక్తి ఇప్పుడే మొదటిసారి మారటోరియం
ఎంచుకుంటున్నట్టైతే సుమారు రూ.2,34,000 వడ్డీ చెల్లించాలి. ఇది 8 ఈఎంఐలతో సమానం.
అంటే రెండుసార్లు మారటోరియం ఆప్షన్ ఎంచుకొని 6 ఈఎంఐలు వాయిదా వేస్తే అదనంగా 16
ఈఎంఐలు కట్టాలి. అందుకే మారటోరియం ఆప్షన్ ఎంచుకుంటే నష్టం తప్ప లాభం లేదు. ఈఎంఐలు
చెల్లించడానికి అస్సలు డబ్బులు లేని పరిస్థితి ఉంటేనే మారటోరియం ఎంచుకోవాలి.
ఆర్థిక పరిస్థితి బాగుంటే ఈఎంఐలు చెల్లించడమే మేలు.
Auto Loan: ఓ వ్యక్తి రూ.6 లక్షల ఆటో లోన్ తీసుకున్నాడని అనుకుందాం. ఇంకా 54 నెలలు
ఈఎంఐ చెల్లించాలి. మొదట మూడు నెలలు ఈఎంఐలు వాయిదా వేయడంతో పాటు మరో మూడు నెలలు
మారటోరియం ఆప్షన్ ఎంచుకున్నాడు. ఆ వ్యక్తి అదనంగా రూ.36,000
వడ్డీ చెల్లించాలి. అంటే 3 ఈఎంఐలు అదనంగా చెల్లించాలి. ఒకవేళ ఆ వ్యక్తి ఇప్పుడే
మొదటిసారి మారటోరియం ఎంచుకుంటున్నట్టైతే సుమారు రూ.19,000
వడ్డీ చెల్లించాలి. ఇది 1.5 ఈఎంఐతో సమానం.
0 Komentar