APలో వస్త్ర, బంగారు, చెప్పుల దుకాణాలు మొ. లగు వాటికి
అనుమతి
ఏపీలో ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చింది. నగలు, బట్టలు, చెప్పుల
షాపులకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా
దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్ట్రీట్
ఫుడ్స్ (పార్సిళ్లు) సైతం అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆభరణాల దుకాణాల్లో
వినియోగదారులకు డిస్పోజబుల్ చేతి తొడుగులు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే
చెప్పుల దుకాణాలు, ఫ్రాంచైజీలను ఎప్పటికప్పుడు క్రిమిరహితం
చేయాలి. ఇక పెద్ద షోరూంలకు వెళ్లాలంటే ఆన్లైన్లో అనుమతి తప్పనిసరి చేసింది. అటు
అన్ని షాపుల్లో ట్రయల్ రూమ్ కు అనుమతి నిరాకరించగా, పానీపూరి
బండ్లకూ అనుమతి ఇవ్వలేదు.
0 Komentar