జూన్ 30
వరకు లాక్ డౌన్ పొడిగింపు
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం
తీసుకుంది. లాక్ డౌన్ 4 గడువు రేపటితో ముగియనుండగా.. దానిని
మరో 30 రోజులు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా కంటైన్మెంట్
జోన్లు మినహా మిగిలిన జోన్లకు లాక్ డౌన్ నుండి మినహాయింపులు ఉంటాయని తెలిపింది. అయితే,
రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల
వరకు మాత్రం కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. అటు ప్రార్థనా మందిరాలు, హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్
మాల్స్ జూన్ 8 నుండి తెరుచుకోవడానికి కేంద్రం అనుమతించింది. పాఠశాలలు,
కళాశాలలు, విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర
ప్రభుత్వాలకే నిర్ణయాధికారం ఇచ్చింది. అంతర్జాతీయ విమాన సేవలు, మెట్రో రైళ్లకు మాత్రం కేంద్రం అనుమతి ఇవ్వలేదు.
ఫేజ్ 1
కేంద్ర ఆరోగ్య
శాఖ ప్రామాణిక నియమావళి(ఎస్‌ఓపీ) జారీ చేయనున్న నిభందనల ప్రకారం
>జూన్ 8వ తేదీ నుంచి మతపరమైన స్థలాలు, ప్రార్థన మందిరాలను ప్రజల దర్శనార్థం తెరుస్తారు.
>హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర
ఆతిథ్య సేవలు ప్రారంభం
>షాపింగ్ మాళ్లు ప్రారంభించవచ్చు.
ఫేజ్ 2
కేంద్ర ఆరోగ్య
శాఖ ప్రామాణిక నియమావళి(ఎస్‌ఓపీ) జారీ చేయనున్న నిభందనల ప్రకారం
>పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్
సెంటర్ల ప్రారంభంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో
సంప్రదింపుల అనంతరం జూలైలో నిర్ణయం తీసుకుంటారు.
>రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
విద్యా సంస్థల స్థాయిలో తల్లిదండ్రులు, ఈ అంశంతో ముడిపడి
ఉన్న వారితో చర్చిస్తాయి. వారి స్పందన ఆధారంగా ఈ విద్యా సంస్థలను తెరవడంపై నిర్ణయం
వెలువడుతుంది.
ఫేజ్ 3
పరిస్థితులను
బట్టి కింది కార్యకలాపాలు పునరుద్ధరన తేదీలు ప్రకటిస్తారు.
>అంతర్జాతీయ విమాన సర్వీసులు..
>మెట్రో రైళ్లు
>సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, పార్క్‌లు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియాలు,
సమావేశ మందిరాలు, ఈ కోవలోకి వచ్చేవి.
>సామాజిక, రాజకీయ, క్రీడాపరమైన,
వినోదపరమైన, బోధనపరమైన, సాంస్కృతిక,
మతపరమైన వేడుకలు, ఇతర భారీ సమావేశాలు
లాక్‌డౌన్
కట్టడి జోన్లకే..
> లాక్‌డౌన్ 5.0 కంటైన్‌మెంట్ జోన్లలో జూన్ 30వ తేదీ వరకు
కొనసాగుతుంది.
>కేంద్ర
ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు కంటైన్‌మెంట్ జోన్లను
ప్రకటించవచ్చు.
>కట్టడి జోన్లలో
కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇస్తారు. వైద్య అత్యవసర సేవలకు, నిత్యావసర
వస్తువుల రవాణాకు మినహాయింపు ఉంటుంది.
>రాష్ట్రాలు
కట్టడి జోన్ల వెలుపల బఫర్ జోన్లను కూడా గుర్తించాలి. కొత్త కరోనా పాజిటివ్
కేసులు నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను బఫర్ జోన్లు అంటారు. ఈ బఫర్
జోన్లలో కూడా జిల్లా యంత్రాంగాలు తగిన ఆంక్షలు విధించవచ్చు.
ఇతర నిబంధనలు
>రాష్ట్రాలు
అవసరాన్ని బట్టి కట్టడి జోన్లు కాని ప్రాంతాల్లో వివిధ కార్యకలాపాలపై నిషేధం లేదా
ఆంక్షలు విధించవచ్చు.
>రాష్ట్రం
లోపల,
ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వ్యక్తులు, వస్తు రవాణా విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. వీటి కోసం ఎలాంటి ప్రత్యేక పాస్,
అనుమతి పొందాల్సిన అవసరం లేదు.
>రాష్ట్రం లోపల, ఒక
రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వ్యక్తులు, వస్తు రవాణా
విషయంలో ఆంక్షలు అవసరం అని ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే దీనిపై ముందుగానే
ప్రజలకు సమాచారం ఇవ్వాలి.
>రైళ్లు, దేశీయ
విమాన సర్వీసులు, ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల
తరలింపునకు సంబంధించిన విమాన సేవలు, తదితర అంశాలపై
ఎప్పటికప్పుడు ప్రామాణిక నియమావళి జారీ చేస్తారు.
>ఎలాంటి వస్తు
రవాణానూ రాష్ట్రాలు అడ్డుకోరాదు.
>65
ఏళ్ల వయసు పైబడిన వారు, వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భిణులు, 10 ఏళ్లలోపు చిన్నారులు అత్యవసరమైతే తప్ప
ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.
>ప్రజలు
ఆరోగ్యసేతు మొబైల్ యాప్‌ను వినియోగించాలి. దీనిపై జిల్లా యంత్రాంగాలు మరింత
దృష్టి పెట్టాలి.
>లాక్‌డౌన్
విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్రాలు నీరుగార్చరాదు.
>జాతీయ
విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు
తీసుకుంటారు.
>కోవిడ్–19 నిర్వహణకు సంబంధించి ఇదివరకే జారీ చేసిన జాతీయ మార్గదర్శకాలు అమల్లో
ఉంటాయి.
లాక్ డౌన్ 5.0 మార్గదర్శకాలు...
DOWNLOAD
0 Komentar