ఆగస్టు నుంచి
కొత్త విద్యా సంవత్సరం?.. ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదనలు
కరోనా నేపథ్యంలో
పాఠశాల విద్యా శాఖకు సంబంధించి 2020-21 విద్యా సంవత్సర అకడమిక్
క్యాలెండర్ లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా ఏటా జూన్ 12 నుంచి ఏప్రిల్ 23వరకూ విద్యాసంవత్సరం ఉంటుంది.
అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 1
నుంచి ప్రారంభించి 2021 జూలై 31 వరకు కొత్త విద్యా సంవత్సరం ఉండేలా అకడమిక్ క్యాలెండర్ రూపొందించాలని
భావిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలలోనూ పలు మార్పులు ఉండవచ్చని అంటున్నారు. అలాగే
దసరా, సంక్రాంతి సెలవులను కుదించే అవకాశం ఉన్నది. ఈ
ప్రతిపాదనలను ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
0 Komentar