ఆంధ్రప్రదేశ్
లోని 9 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్త విభాగాలు
పెరుగుతున్న
వైద్య అవసరాలు అనుగుణంగా బోధనాస్పత్రులను మరింత బలోపేతం చేయాలని సర్కార్
భావిస్తోంది. ఇప్పటివరకు లేని కొత్త విభాగాలను వాటిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర
వైద్య విద్యా శాఖ నిర్ణయించింది. కొత్త విభాగాలు ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్‌లో
పీజీ వైద్య సీట్లు కూడా పెరగనున్నాయి. రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా
ఇందులో 9 బోధనాస్పత్రుల్లో అవసరాన్ని బట్టి కొత్త విభాగాలు, కొన్ని
చోట్ల ఉన్న విభాగాల్లోనే అదనపు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు.
వైద్య కళాశాలలు -
విభాగాలు..
గుంటూరు మెడికల్
కాలేజ్: ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్
అడ్మినిస్ట్రేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్, నియోనెటాలజీ, సర్జికల్ అంకాలజీ, మెడికల్ అంకాలజీ, న్యూరో సర్జరీ (అదనపు యూనిట్),
యూరాలజీ (అదనపు యూనిట్)
కర్నూలు మెడికల్
కాలేజ్: ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్
అడ్మినిస్ట్రేషన్, నియోనెటాలజీ, పీడియాట్రిక్
సర్జరీ, న్యూరో సర్జరీ (అదనపు యూనిట్), యూరాలజీ (అదనపు యూనిట్)
తిరుపతి ఎస్వీఎంసీ:
ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్, నియోనెటాలజీ
విశాఖపట్నం, ఆంధ్రా
మెడికల్ కాలేజ్: ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్
అడ్మినిస్ట్రేషన్, నియోనెటాలజీ, సర్జికల్
అంకాలజీ, మెడికల్ అంకాలజీ, న్యూరో
సర్జరీ (అదనపు యూనిట్), యూరాలజీ (అదనపు యూనిట్), కార్డియాలజీ (అదనపు యూనిట్)
అనంతపురం, ప్రభుత్వ
మెడికల్ కాలేజ్: పీడియాట్రిక్ సర్జరీ
కాకినాడ, రంగరాయ
మెడికల్ కాలేజ్: ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్,
ఎమర్జెన్సీ మెడిసిన్, నియోనెటాలజీ, న్యూరో సర్జరీ (అదనపు యూనిట్)
కడప, ప్రభుత్వ
మెడికల్ కాలేజ్: ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, నియోనెటాలజీ
శ్రీకాకుళం, ప్రభుత్వ
మెడికల్ కాలేజ్: ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్
ఒంగోలు, ప్రభుత్వ
మెడికల్ కాలేజ్: ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ,
ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ.
తేది. 18-05-2020
నాటి సాక్షి దినపత్రిక సౌజన్యంతో..
0 Komentar