మరో నాలుగు
రోజులు ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలలో నిప్పులే..!
నేటి నుంచి
రోహిణి కార్తె ప్రవేశిస్తున్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వడగాడ్పుల ముప్పు
పొంచి ఉన్నదని, నాలుగు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ
హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 25 నుంచి 28వ తేదీ
వరకు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వడగాడ్పులు
వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొన్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం
చేయాలని విపత్తు నిర్వహణ శాఖ అన్ని జిల్లాల అధికారులకు సూచించింది.
మరోపక్క తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా
భానుడి ఉగ్రరూపానికి తెలంగాణ విలవిల్లాడింది. ఎండ వేడికితోడు ఉత్తరాది నుంచి
వీస్తున్న వడగాడ్పులతో వివిధ జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర భారతం
నుంచి రాష్ట్రంపైకి వేడిగాలులు, పొడిగాలులు వస్తున్నాయని, ముఖ్యంగా రాజస్తాన్ నుంచి ఈ గాలులు వస్తుండటంతో తెలంగాణలో తీవ్రమైన ఎండలు,
వడగాడ్పులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.
అలాగే రోహిణి కార్తె కావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని, 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత దాటితే ఆయా ప్రాంతాల్లో వడగాడ్పుల తీవ్రత
అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
0 Komentar