ఏపీలో పరిధిలో రాకపోకలకు
అనుమతులు అవసరం లేదు - డీజీపీ
ఏపీలో రాకపోకలకు
అనుమతులు అవసరం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అనగా రాష్ట్రంలో ఒక ప్రాంతం
నుంచి మరో ప్రాంతానికి వ్యక్తిగత వాహనాల్లో వెళ్లేందుకు ప్రత్యేక అనుమతులు అవసరం
లేదన్నారు. జిల్లాల సరిహద్దుల్లో వాహనాలు ఆపవద్దని ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చినట్లు
గౌతమ్ సవాంగ్ తెలిపారు. కారుల్లో ముగ్గురికి మించకుండా ప్రయాణించడం మాస్కులు
ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. తెలంగాణ సహా చుట్టు పక్కల
రాష్ట్రాల నుంచి ఏపీలోకి రావాలంటే మాత్రం అనుమతి ఉండాల్సిందే. ఇతర రాష్ట్రాలకు అత్యవసరంగా వెళ్లాల్సినవారు వారి
అత్యవసర పరిస్థితిని నిరూపించే సాక్ష్యాధారాలతో http://serviceonline.gov.in/epass/ అంతర్జాల
చిరునామాలో దరఖాస్తు చేసుకోవాలి.
0 Komentar