స్కూళ్లు, కాలేజీల్లో
ప్రార్థన, క్రీడలకు సెలవు: విద్యాసంస్థలకు హెచ్‌ఆర్డీ గైడ్‌లైన్స్
పాఠశాలలు, కళాశాలలు
పునఃప్రారంభమయ్యాక విద్యార్థుల రక్షణకోసం చేపట్టాల్సిన చర్యలపై మానవ వనరుల
మంత్రిత్వ శాఖ తాజాగా మార్గదర్శకాలను రూపొందిస్తోంది. తరగతి గదిలో విద్యార్థులు
కూర్చొనే విధానం, మెస్, గ్రంథాలయం,
క్యాంటీన్, హాస్టళ్లు అన్నీ భౌతిక దూరం
నిబంధనను పాటించడానికి వీలుగా కొత్తరూపును సంతరించుకోనున్నాయి. భౌతిక దూరం
నిబంధనలను పాఠశాలలకు పాఠశాల విద్యాశాఖ, కళాశాలలకు యూజీసీ
విడివిడిగా రూపొందిస్తాయి.
పాఠశాలల్లో ఉదయపు
అసెంబ్లీలను రద్దు చేయడం, క్రీడాకార్యకలాపాలను నిలిపివేయడం, స్కూల్ బస్సులకు నిబంధనలను తయారుచేయడం, స్కూల్
యూనిఫామ్‌లో మాస్కులను తప్పనిసరి చేయడం. మరుగుదొడ్లు వినియోగించడంలో పాటించాల్సిన
నియమాలూ, క్యాంటీన్ల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
విద్యాసంస్థల భవనాలను క్రమం తప్పకుండా డిస్‌ఇన్ఫెక్ట్ చేయడం లాంటి కీలకమైన
విషయాలు ఈ మార్గదర్శకాల్లో ఉన్నాయి.
ఇప్పటికే ఇండియన్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లాంటి కొన్ని విద్యాసంస్థల్లో భౌతిక దూరం
పాటించేందుకూ, విజిటర్స్ ని పరిమితం చేసేందుకూ, షిఫ్ట్ ల విధానంలో తరగతులు, లాబొరేటరీల సమయాల్లో
మార్పు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆన్‌లైన్ పరీక్షలు, పోటీ పరీక్షల నిర్వహణలో కూడా రక్షణ చర్యలు చేపట్టాలని ఆ మార్గదర్శకాల్లో ఉండనున్నాయి.
0 Komentar