292 ల్యాబ్
టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి:
రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా మెడికల్, పారా
మెడికల్ విభాగాల్లో అదనపు వైద్య సిబ్బందిని నియమిస్తున్న ప్రభుత్వం తాజాగా 292
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టు లను నియమించనుంది. ఈ మేరకు కుటుంబ సంక్షేమశాఖ
కమిషనర్ కాటమనేని బాస్కర్ ఉత్తర్వులిచ్చారు. కాంట్రాక్టు పద్ధతిలో నియమించే ఈ
పోస్టుల నియామకాలు ఆయా జిల్లాల కలెక్టర్లు చేపట్టాలని తెలిపారు. ఏడాది కాలం పని చేసేందుకు
కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకునే వీరికి నెలకు రూ.28 వేలు వేతనం ఇస్తారు.
అత్యధికంగా 51 పోస్టులు తూర్పు గోదావరి జిల్లాలో, నెల్లూరులో
43 పోస్టులు ఉన్నాయి.
0 Komentar