ధ్రువపత్రాలు, దరఖాస్తుల
అప్లోడ్ గడువు పొడిగించిన ఎన్టీఏ
సాక్ష్మి
అమరావతి: లాక్డౌన్ నేపథ్యంలో ఆయా జాతీయ ప్రవేశ తదితర పరీక్షలకు సంబంధించి అర్హత, రిజర్వుడు
కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్ల సమర్పణ గడువును పొడిగిస్తూ నేషనల్ టెస్టింగ్
ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయం తీసుకుంది. అయితే ఫొటోలు, సంతకాలకు
సంబంధించిన పత్రాలను యధావిధిగా అప్లోడ్ చేయాలని స్పష్టంచేసింది. ఆయా పరీక్షలకు సంబంధించి
సర్టిఫికెట్లను సమర్పించేందుకు అభ్యర్థులు అవస్థలు పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తదితర కేటగిరీల అభ్యర్థులు సమస్యలెదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్టీఏ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
*జాయింట్
సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించి ఈనెల 5వ తేదీ గడువు.
అయితే లాక్ డౌన్ మే 17 వరకు ఉన్నందున గడువును పెంచింది.
లాక్డౌన్ తర్వాత తదుపరి తేదీని ప్రకటించనుంది.
*నేషనల్ కౌన్సిల్
ఫర్ హోటల్ మేనేజ్మెంట్ (ఎన్సీహెచ్ఎం) జేఈఈ మెయిన్-2020, ఐసీఏఆర్,
జేఎన్యూ ఎంట్రన్స్ పరీక్షలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులు, ఆయా ద్రువపత్రాల సమర్పణకు గడువు మే 15. లాక్ డొన్
నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ఎన్టీఏ ప్రకటించింది.
*ఆలిండియా అయుష్
పోస్టు గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్టుకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుకు జూన్ 5
వరకు గడువుంది.
0 Komentar