ఆంధ్రప్రదేశ్
వైద్య శాఖలో 9,700 పోస్టుల భర్తీ
కరోనా మహమ్మారి
విపత్కర సమయంలో సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య శాఖలో ఖాళీగా ఉన్న
పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఒకే నోటిఫికేషన్
ద్వారా 9,700 పోస్టులను భర్తీ చేయనున్నారు. వైద్య విద్యా శాఖలో, బోధనాస్పత్రులు,
వైద్య విధాన పరిషత్‌లో, సామాజిక ఆరోగ్య
కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా
ఆస్పత్రులు, ప్రజారోగ్య శాఖ పరిధిలో.. ప్రాథమిక ఆరోగ్య
కేంద్రాల్లో పనిచేసేందుకు స్పెషలిస్టు డాక్టర్ల నుంచి స్టాఫ్ నర్సుల వరకు మొత్తం 9,700 పోస్టులను భర్తీ చేపడుతున్నామని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్
రెడ్డి తెలిపారు. ఈ నియామకాల నోటిఫికేషన్‌ను నేడో, రేపో జారీ
చేయనున్నారు. వైద్యులు, కొన్ని విభాగాల్లో స్టాఫ్ నర్సులు,
పరిపాలనా సిబ్బందిని మాత్రమే రెగ్యులర్ ప్రాతిపదికన నియమిస్తారు. ల్యాబ్
టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డెంటల్
అసిస్టెంట్ వంటి మిగతా పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు.
అయితే ఈ నోటిఫికేషన్
లో కొన్ని నిభందనలు విధించనున్నారు.. అవి..
>ఎంపికైన
వైద్యులు మూడేళ్ల పాటు ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత సర్వీస్ రెగ్యులర్ అవుతుంది.
>కొత్తగా
ఎంపికయ్యే వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుకు అనుమతి లేదు.
>ఎంపికైన వైద్యులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఒక ఏడాది విధిగా గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో
పనిచేయాల్సి ఉంటుంది.
0 Komentar