‘పఢ్‌నా
లిఖ్‌నా అభియాన్’ సాక్షర్ భారత్ స్థానంలో కొత్త పథకం
సాక్షర
భారత్‌ను రద్దుచేసిన కేంద్రం దాని స్థానంలో ‘పఢ్‌నా లిఖ్‌నా అభియాన్' పథకానికి శ్రీకారం
చుట్టింది. దేశవ్యాప్తంగా 15 ఏళ్లు పైబడిన 55లక్షల మంది నిరక్షరాస్యులను
అక్షరాస్యులుగా మార్చాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తెరపైకి
తెచ్చింది.
ఈ
సారి బీఈడీ, డీఈడీ విద్యార్థులను
వాలంటీర్లుగా నియమిస్తారు. ఒక్కొక్కరు 8-10 మందిని
అక్షరాస్యులుగా మార్చాలి. అయితే ఈ కొత్త పథకంలో వాలంటీర్లకు గౌరవ వేతనం ఉండదు.
గ్రామస్థాయిలో ప్రధానోపాధ్యాయుడిని విలేజ్ లిటరసీ సూపర్‌వైజర్‌గా, మరో ఉపాధ్యాయుడిని విలేజ్ లిటరసీ టీచర్‌గా నియమిస్తారు. 4 నెలల వ్యవధిలో వాలంటీర్ నిరక్షరాస్యులకు చదువు నేర్పిన తర్వాత జాతీయ
సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 40 శాతం మార్కులు సాధించిన వారికి సర్టిఫికెట్ ఇస్తారు.
0 Komentar