ప్రధాని మోదీ సీఎంలతో
వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యాంశాలు
కరోనా నియంత్రణ, లాక్‌డౌన్
నిర్వహణ, ఆర్థిక రంగ ఉద్దీపన సహా పలు అంశాలపై సోమవారం
ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ భేటీలో హోం
మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఆరోగ్య మంత్రి
హర్షవర్ధన్ తదితరులు కూడా పాల్గొన్నారు. వీరితో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి , చంద్రశేఖర రావు లతో పాటు పలు
రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీలో పాలు పంచుకున్నారు.
కొన్ని ముఖ్యాంశాలు
*కరోనా, లాక్‌డౌన్‌లతో
దారుణంగా దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం సాయం అందించాలని
పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభ్యర్థించారు.
*వ్యాప్తిని
తగ్గించే దిశగా దృష్టి పెట్టాలని, ప్రజలు ‘రెండు
గజాల దూరం’సహా అన్ని నిబంధనలను పాటించేలా చూడాలని పీఎం
కోరారు.
*ఆర్థిక
కార్యకలాపాలను పూర్తి స్థాయిలో పునఃప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు
చెప్పారు.
లాక్‌డౌన్
పొడిగింపుపై సీఎంలు ఏమన్నారు..!
కరోనా కేసులు
నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత పొడిగించాలని పలు రాష్ట్రాలను
ప్రధాని నరేంద్రమోదీని కోరాయి. లాక్‌డౌన్ పొడిగించమని కోరిన రాష్ట్రాల్లో
మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమ బెంగాల్,
తెలంగాణలు ఉన్నాయని సమాచారం.
*''లాక్‌డౌన్
సడలింపులు, కంటైన్మెంట్ వ్యూహాలపై పూర్తిగా పునరాలోచించాల్సిన అవసరం ఉంది. కంటైన్‌మెంట్
కారణంగా ఆర్థికలావాదేవీలకు ఇబ్బంది నెలకొంది. దీనిలో మార్పులు చేయాలి'' -ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి
*''ప్రయాణికుల
రైళ్లను అప్పుడే పునరుద్ధరించ వద్దు. రైలు ప్రయాణికులందరినీ క్వారంటైన్ చేయడం
సాధ్యం కాదు.'' -తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
*''రాష్ట్రానికి
రూ.3వేల కోట్ల విలువైన మెడికల్ పరికరాలు కావాలి. మే 31 వరకూ చెన్నైకు రైళ్లు, విమాన రాకపోకలు
అనుమతించవద్దు'' - తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి
*''బిహార్‌లో లాక్‌డౌన్ మరికొన్ని రోజులు పొడిగిస్తాం. ఒకసారి లాక్‌డౌన్ ఎత్తివేస్తే, ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున బిహార్‌కు వస్తారు'' -బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్
*''దేశంలో సమాఖ్య వ్యవస్థకు గౌరవం
ఇవ్వండి. కరోనాపై రాష్ట్రం పోరాడుతున్న ఈ సమయంలో కేంద్రం రాజకీయాలు చేయడం తగదు''-
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
0 Komentar