Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Prime Minister Narendra Modi's address to the nation on COVID-19 related issues

లాక్‌డౌన్‌ 4.0
లాక్‌డౌన్‌ను మే 17 తరువాత కూడా పొడిగించనున్నట్లు ప్రధాని సంకేతాలు ఇచ్చారు. అయితే, లాక్‌డౌన్‌ 4.0 కు సంబంధించిన పూర్తి వివరాలను మే 18 లోపు వెల్లడిస్తామన్నారు.
ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
*ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు రూ.20 లక్షల కోట్లతో ఉద్దీపన పథకాన్ని ప్రారంభించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌పథకం రూపకల్పన.
*వ్యవస్థలోని అందరినీ ఆదుకునేలా రూపొందించిన ఈ భారీ ప్రత్యేక ప్యాకేజీ దేశ జీడీపీలో దాదాపు 10%.
*ఆత్మబలం, ఆత్మ విశ్వాసం నిండుగా ఉన్న ఆత్మ నిర్భర్‌ భారత్‌దేశ ప్రజల నినాదం కావాలన్నారు.
* కరోనా మానవజాతికి ఇది ఊహాతీతమని.. అలసిపోవద్దు, ఓడిపోవద్దు, కుంగిపోవద్దు, పోరాటంతోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
*ఒక్క వైరస్ ప్రపంచం మొత్తాన్నీ సమస్యల్లోకి నెట్టేసింది. ఇలాంటి పరిస్థితినీ ఎప్పుడూ చూడలేదు, కనీసం వినలేదు కూడా అని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
*మానవ జాతి ఇదివరకెప్పుడూ ఊహించని ఉత్పాతమిది. కానీ, అలసిపోవడం, ఓడిపోవడం, వెనుకంజ వేయడం మనుషులు సహించరు. మనల్ని మనం కాపాడుకోవాలి. ముందుకు సాగాలి.
* ప్రతి రోజూ 2 లక్షల పీపీఈ కిట్లు, 2 లక్షల ఎన్95 మాస్కులు తయారుచేస్తున్నాం.
*కరోనా వైరస్‌ కారణంగా మునుపెన్నడూ చూడనటువంటి సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటోంది. భారత్‌లోనూ ఈ వైరస్‌ తీవ్ర ప్రభావం చూపింది. 
* కరోనా సమస్య చుట్టూనే తిరుగుతూ ఇతర కీలక  కార్యక్రమాలను విస్మరించలేం.
* స్వయం సమృద్ధి సాధించడం ఇప్పుడు అత్యావశ్యకం. స్వయం సమృద్ధ భారత్‌ ఇప్పుడు అత్యంత అవసరం.
* బహిరంగ మల విసర్జన, పోలియో, పౌష్టికాహార లోపంపై.. ఇలా భారత్‌ సాధించిన ప్రతీ విజయం ప్రపంచంపై ప్రభావం చూపింది. 
* ఇప్పుడు మన వద్ద వనరులున్నాయి. శక్తి, సామర్థ్యాలున్నాయి. అత్యుత్తమ వస్తువులను ఉత్పత్తి చేయాలి.
*మనమంతా దేశీయ ఉత్పత్తులను కొనడమే కాదు, వాటికి ప్రచారం కూడా చేయాలి.
*దేశీయ సంస్థలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాయి.  అందుకు మనమంతా ప్రోత్సహించాలి.
* మంచి ప్రోత్సాహం అందించడంతో ఖాదీ, చేనేతలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. అవి బ్రాండ్‌ల స్థాయికి వెళ్లాయి.
* వై2కే,  కచ్‌ భూకంపం వంటి ఎన్నో సవాళ్ళను మనం ఎదుర్కున్నాము.
* కరోనా నేపథ్యంలో దేశప్రజలనుద్దేశించి టీవీ మాధ్యమం ద్వారా ప్రధాని ప్రసంగించడం ఇది మూడో సారి.
Prime Minister Narendra Modi's address to the nation on COVID-19 related issues


COVID-19 సంబంధిత అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రసంగం లైవ్ లో చూడండి...
Previous
Next Post »
0 Komentar

Google Tags