రాష్ట్ర
వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి లబ్ధిదారుల ఇంటికే నాణ్యమైన బియ్యం
సెప్టెంబర్ 1వ
తేదీ నుంచి నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటికే డోర్ డెలివరీ చేయాలని
అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కోవిడ్–19 నివారణ చర్యలపై సమీక్షలో భాగంగా శుక్రవారం ఆయన పౌరసరఫరాల శాఖ అధికారులకు
ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేసే
కార్యక్రమంలో భాగంగా నాణ్యమైన బియ్యాన్ని సేకరించడం, ఆ
బియ్యాన్ని ప్యాక్ చేయడం, ఇంటికే డోర్ డెలివరీ చేయడాన్ని గత
ఏడాది సెప్టెంబర్ 6 నుంచి శ్రీకాకుళం జిల్లాలో
ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. నాణ్యమైన బియ్యాన్ని అందుకుంటున్న వారి నుంచి
అభిప్రాయాలను కూడా ప్రభుత్వం స్వీకరించింది.
నిరంతర
ప్రక్రియగా బియ్యం కార్డుల మంజూరు
*గ్రామ,
వార్డు సచివాలయాల్లో అర్హులైన వారందరికీ కార్డులు మంజూరు చేసే
వ్యవస్థను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.
*అర్హత
ఉన్న ప్రతి ఒక్కరికీ బియ్యం కార్డు అందించడానికి సామాజిక తనిఖీలో భాగంగా సచివాలయాల్లో
లబ్ధిదారుల జాబితాను ఉంచారు.
*
అందులో పేరులేని వారు ఎవరికి దరఖాస్తు చేయాలన్న వివరాలను కూడా అందుబాటులో ఉంచారు.
* వాటి
ఆధారంగా దరఖాస్తులు పరిశీలించి అర్హులైన వారికి అధికారులు బియ్యం కార్డులను మంజూరు
చేశారు. ఇది నిరంతర ప్రక్రియగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
0 Komentar