రైలులో ప్రయాణాలకు
మార్గదర్శకాలు జారీచేసిన రైల్వే శాఖ
50 రోజుల విరామం తర్వాత
రెగ్యులర్ ప్రయాణికుల రైళ్లు నేటి నుండి పట్టాలు ఎక్కనున్నాయి. కోవిడ్-19 దృష్ట్యా
రైలు ప్రయాణాలకు రైల్వే శాఖ మార్గదర్శకాలు
జారీచేసింది.
మార్గదర్శకాలివీ...
* ప్రస్తుతం
పనిచేయనున్న ప్రత్యేక రైళ్లలో ఏసీ తరగతులే ఉంటాయి. ఫస్ట్ ఏసీ, సెకెండ్
ఏసీ, థర్డ్ ఏసీ కోచ్‌లే ఉంటాయి.
* జనరల్ టికెట్లు
ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి.
* టికెట్ల
బుకింగ్‌కు కౌంటర్లు ఉండవు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారానే
బుకింగ్ చేసుకోవాలి . తత్కాల్ బుకింగ్, అన్ రిజర్వ్‌డ్
టికెట్లు (యూటీఎస్) అనుమతించరు.
* కన్ఫర్మ్‌డ్
టికెట్లను మాత్రమే అనుమతిస్తారు. ఆర్‌ఏసీ, వెయిటింగ్ టికెట్‌ను
అనుమతించరు.
*రైలు ప్రయాణికులు 90 నిమిషాలు
ముందుగా స్టేషను చేరుకోవాలి.
*ముఖాలకు మాస్కులు తప్పనిసరిగా
ధరించాలి.
* ప్రయాణికులందరినీ తప్పనిసరిగా
స్క్రీనిం గ్ చేస్తారు. కోవిడ్ లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు.
* ప్రతి ప్రయాణికుడు ఆరోగ్యసేతు
యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* ఆహారం, మంచినీరు
వెంట తెచ్చుకోవాలి. టికెట్ బుకింగ్ సమయంలో కోరితే కోరితే ప్యాకేజ్ వాటర్, భోజనం అందిస్తారు.
* ప్రయాణికులకు రైళ్లలో బెడ్
షీట్లు,
దిండ్లు ఇవ్వరు. కూపేలు, కిటికీల కర్టెన్లను
తొలగించనున్నారు.
* టికెట్ రద్దు
(క్యాన్సలేషన్) చేసుకోవాలనుకుంటే రైలు బయలుదేరే షెడ్యూలు సమయం కంటే 24
గంటల ముందు అనుమతిస్తారు. క్యాన్సలేషన్ చార్జీగా టికెట్ ధరలో 50 శాతం విధిస్తారు.
0 Komentar