రంజాన్
====================
ముస్లింలు
చాంద్రమాన కేలండర్ ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్
తొమ్మిదవ నెల 'రంజాన్', దీనిని ముస్లింలు అత్యంత
పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం 'దివ్య
ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక
చింతనల కలయికే 'రంజాన్ మాసం'. ఖురాన్
ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం 'ఉపవాసవ్రతం'
. ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో 'రోజా' అని అంటారు. సౌమ్ అని పిలుస్తారు. ఈ ఉపవాస విధిని గురించి దివ్యఖురాన్
గ్రంథం. భారతదేశంలో ముస్లింలు రాత్రి నిద్రపోయి తెల్లవారి నాలుగు గంటలకు లేచి సహర్
చేస్తారు.
జకాత్ (దానం)
రంజాన్ నెలలో
మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. సంపాదనాపరులైనవారు, సంపన్నులైనవారు
రంజాన్ నెలలో 'జకాత్' అచరించాలని ఖురాన్
బోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని 'జకాత్' అని అంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కుగా
పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి 30
శాతం చొప్పున ధన, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా యిస్తారు. పేదవారు కూడా అందరితో పాటు
పండుగను జరుపుకొనడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ 'జకాత్ ' ఉపయోగపడుతుంది.
ఫిత్రా
'జకాత్'
తో పాటు 'ఫిత్రా' దానానికి
రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడుపూటల తిండికి, ఒంటినిండా
బట్టకు నోచుకోని పేదవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం మతం ఉద్భోదిస్తూవుంది.
దీనినే 'ఫిత్రాదానం' అని పిలుస్తారు.
ఉపవాసవ్రతాలు విజయవంతంగా ముగిసినందులకు దేవుడి పట్ల కృతజ్ఞతగా .. పేదలకు ఈ
ఫిత్రాదానం విధిగా అందజేస్తారు.
షవ్వాల్
ఈ విధంగా రంజాన్
నెల అంతా పవిత్ర కార్యక్రమాలతో ముగుస్తూనే, 'షవ్వాల్' నెలవంక ప్రత్యక్షమవుతుంది. ఈ నెలవంక దర్శనమిస్తేనే ముస్లిం సోదరులు
ఉపవాసవ్రతాన్ని విరమించి, మరుసటి రోజు 'రంజాన్ ' పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో సంతోషానందాలతో
జరుపుకుంటారు. ‘షవ్వాల్' నెల మొదటి
రోజున జరుపుకునే రంజాన్ పండుగను 'ఈదుల్‍ఫితర్' అని అంటారు.
ఈద్‍ముబారక్
నెల పొడుపుతో
రంజాన్ ఉపవాస దీక్షలు విరమించి మరుసటి దినాన్ని రంజాన్ పండుగగా నిర్ణయిస్తారు.
అల్లా రక్షణ, కరుణ అందరూ పొందాలన్న ఆశయంతో ఈద్గాలో బారులుతీరి పండుగ
నమాజు చేస్తారు. కొత్త వస్త్రాలు, పరిమళ ద్రవ్యాలతో
వాతావరణమంతా ఆహ్లాదకరమవుతుంది. ధనిక, బీద తారతమ్యం లేక,
సహృదయాలతో సద్భావనలతో ఆలింగనం చేసుకుంటారు. ద్వేషాలన్నీ సమసి
ప్రేమపూరిత భావం ఇనుమడిస్తుంది. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి పండుగ నమాజును
ఊరిబయట నిర్ణీత ప్రదేశాలైన ఈద్‍గాహ్ లలో చేస్తారు. అనంతరం ఒకరికొకరు 'ఈద్‍ముబారక్’ (శుభాకాంక్షలు) చెప్పుకుంటారు.
ఇఫ్తార్ విందు
ఈ నెలలో జరిగే 'ఇఫ్తార్
విందు' ల్లో ఆత్మీయత సహృద్భావాలు ప్రసుప్టమవుతాయి. పరస్పర
ధోరణికి, విశాల ఆలోచనా దృక్పథానికి ఇవి నిదర్శనం.
====================
0 Komentar