పంచాయతీ
కార్యదర్శుల ఖాళీల భర్తీ...!
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పంచాయితీ కార్యదర్శలు పోస్టులను తాత్కాలికంగా భర్తీ
చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లకు
శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కరోనా నియంత్రణకు సంబంధించిన పనులు గ్రామపంచాయితీల
పరిధిలో ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కార్యదర్శులు లేని పంచాయితీల్లో
జరిగే పనులకు కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కొన్నిప్రాంతాల్లో ఒక్కో కార్యదర్శి
సుమారు 5 గ్రామాలను పర్యవేక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్ని గ్రామాలను
ఒకేసారి పర్యవేక్షణ చేయడం ఒక్క కార్యదర్శికి ఇబ్బందిగా మారింది. దీనితో కరోనా
కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాల నిర్వహణకు కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
దీనితో విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న గ్రామపంచాయితీ
కార్యదర్శులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం
నిర్ణయించింది.
శాశ్వత
ప్రాతిపదికన భర్తీ చేసే వరకు పరిపాలనలో జాప్యం జరగకుండా పోస్టులను తాత్కాలిక
పద్ధతిలో నేరుగా భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీనితో
జిల్లాల వారీగా ఖాళీలను గుర్తించి, వాటిని అర్హులతో భర్తీ
చేసేందుకు సంబంధిత యంత్రాంగం సిద్ధమవుతోంది.
తేది.
23.05.2020 నాటి ఆంధ్రప్రభ దినపత్రిక సౌజన్యంతో...
0 Komentar