రైతుల ఖాతాల్లో రూ.5,500
‘రైతు భరోసా’ నగదు జమ నేడే
‘వైఎస్సార్
రైతు భరోసా– పీఎం కిసాన్’ పథకం ద్వారా
అన్నదాతల ఖాతాలకు నగదు జమ కార్యక్రమం నేడు ప్రారంభంకానున్నది. ముఖ్యమంత్రి వైఎస్
జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నగదు బదిలీ
కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ఏటా రూ.13,500 చొప్పున వరుసగా రైతులకు రెండో ఏడాది అందిస్తున్నారు. ఒక్కొక్కరి ఖాతాలో
రూ.7,500 జమ చేయనున్నారు. రూ.2వేల పీఎం కిసాన్ నిధులు గత నెలలోనే రైతుల ఖాతాలో జమ
కాగా, మిగిలిన రూ.5,500 డబ్బును నేడు ఖాతాల్లో జమ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా
49,43,590 మంది రైతులకు ఈ నిధులు పంపిణీ చేస్తారు. భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు
రైతుల కుటుంబాలకు కూడా రూ.13,500 సాయం అందుతుంది. ఈ వర్గాలకు
చెందిన కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి మొత్తాన్ని చెల్లిస్తుంది.
Know Your Payment Status
0 Komentar