ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు
>తొలిరోజే ‘జగనన్న విద్యా కానుక’ కింద 7 వస్తువులు
>ఇప్పటికే నాడు-నేడు పనులు వేగవంతం
>బస్సు పాస్ లు ఉచితం & వేరే
వాహనాల్లో వచ్చే వారికి ఛార్జీ చెల్లింపు..
అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ప్రభుత్వ పాఠశాల దశ మారనున్నది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా
ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. 2020–21 విద్యా సంవత్సరం
నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద 7 రకాల వస్తువులను కిట్ రూపంలో ప్రతి విద్యార్థికి పంపిణీ చేయనుంది.
బడులు తెరిచిన
మొదటి రోజునే 7 రకాల వస్తువులను (3 జతల యూనిఫామ్,
బెల్టులు, షూలు, సాక్స్,
పాఠ్యపుస్తకాలు,నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్‌లు) విద్యార్థులకు అందించేందుకు సమగ్ర శిక్ష అభియాన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు
బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. వేరే వాహనాల్లో వచ్చే వారికి
అయ్యే ఛార్జీని కూడా చెల్లించనుంది. విద్యార్థి అభీష్టం మేరకు ఆంగ్ల మాధ్యమంలో
కూడా బోధన కొనసాగనుంది. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉన్నా ప్రతి తరగతిలో తెలుగు
తప్పనిసరిగా ఉంటుంది. సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకే నిధుల లభ్యత ఉంటుంది.
9, 10 తరగతుల వారికి ఎస్‌ఎస్‌ఏ నిధులు రావు. దీంతో ఆ
విద్యార్థులకు అయ్యే వ్యయం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. దీనివల్ల 9,
10 తరగతులకు చెందిన 8,28,369 మంది
విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది.
0 Komentar