తెలంగాణాలో లాక్
డౌన్ మే 29 వరకు పొడిగింపు...
పదో తరగతి
పరీక్షలపై ముఖ్యమంత్రి కేసిర్ గారి వాఖ్యలు
పదో తరగతి
పరీక్షలు ఇప్పటి వరకు మూడు పేపర్లు పూర్తి కాగా, మరో ఎనిమిది
పేపర్లకు పరీక్షలు జరగాలి. హైకోర్టు నిబంధనలు పాటిస్తూ ప్రస్తుతమున్న 2,500 పరీక్ష
కేంద్రాలను అవసరమైతే 5వేలకు పెంచుతాం. ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది విద్యార్థుల
చొప్పున శానిటైజర్లు, మాస్కులు ఇచ్చి పరీక్షలు పెడతాం.
తల్లిదండ్రులు ఆందోళన దృష్టిలో పెట్టుకుని కోర్టు అనుమతి తీసుకోవాలని అడ్వొకేట్
జనరల్‌కు చెప్పాం. పిల్లలు వెళ్లడానికి బస్సులు ఏర్పాటుచేస్తాం. ప్రైవేటు వాహనాలు
ఉన్నవారికి పాస్‌లు జారీచేస్తాం. మొత్తానికి మే నెలలోనే పరీక్షలు పూర్తి చేస్తాం.
ఇంటర్మీడియేట్ జవాబు పత్రాల వాల్యూయేషన్ కూడా బుధవారం నుంచి ప్రారంభిస్తాం.
విద్యాశాఖ మంత్రి, కేబినెట్ సబ్ కమిటీ, కార్యదర్శి తదితరులు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన మాడ్యూల్‌ను
తయారు చేస్తారు. వచ్చే విద్యా సంవత్సరం కొంత ఆలస్యంగా జూన్ నెలాఖరు లేదా జూలైలో
ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
కేసీఆర్ ప్రెస్
మీట్ లోని ముఖ్యాంశాలు
*తెలంగాణాలో లాక్
డౌన్ మే 29 వరకు పొడిగింపు. రాత్రి పూట కర్ఫ్యూ కఠినంగా అమలు.
*కేంద్ర
మార్గదర్శకాలకు అనుగుణంగానే దాదాపుగా ఆరెంజ్,గ్రీన్ జోన్లలో సడలింపులు.
*ఆరెంజ్, గ్రీన్
జోన్ల పరిధిలోని మండల,గ్రామాలలో 100% షాపులు తెరుచుటకు
అనుమతి.. ఉదయం10.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు
*ఆరెంజ్,గ్రీన్
జోన్ల పరిధిలోని మున్సిపాలిటీలలో 50% షాపులు తెరుచుకొనుటకు అనుమతి... ఉదయం 10.00
గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు
*మద్యం అమ్మకాలను
రేపటి నుండి ప్రారంభమవుతాయి. 11% రేటు పెంచుతున్నాము.
*కరోనా సమస్య
రోజుల్లో పరిష్కారం కాదు. దానితో మనం కలిసి బతకాల్సిందే. ఈ ఆపద నుంచి బయట పడేందుకు
శక్తి సంతరించుకోవాలి.
*రాష్ట్రంలో
ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించడంలేదు. ఒక జిల్లా గ్రీన్ జోన్‌లో ఉంటే
పొరుగు జిల్లాలు ఆరెంజ్, రెడ్‌జోన్లలో ఉన్నాయి. ఈ పరిస్థితిలో
జిల్లాల మధ్య బస్సులు నడపలేం.
*ఈ నెల 24న
రంజాన్ పండుగ జరుపుకోనున్నారు. అయితే, పండుగ అవసరాలకు ప్రత్యేక
సడలింపులు ఇవ్వడంలేదు. ఇళ్లలోనే పండుగ నమాజ్ చేసుకోవాలి.
*విదేశాల నుంచి
రాష్ట్రానికి వచ్చే వారిని పెయిడ్ క్వారంటైన్‌లో ఉంచాలని కేంద్రం కోరింది. దీనిని
దృష్టిలో పెట్టుకుని అత్యవసరమైతేనే విదేశాల నుంచి తిరిగి రావాలి. హోటళ్లు, లాడ్జీల్లో
14 రోజులు ఉండి వీరే అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అప్పటి వరకు వారిని ఇళ్లకు
పంపించే అవకాశం లేదు.
*కేసీఆర్ బతికి
ఉన్నంత వరకు, టీఆర్‌ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత వరకు రైతుబంధు
పథకం యధాతథంగా కొనసాగుతుంది.
*గృహ నిర్మాణ
రంగానికి సంబంధించి సిమెంట్, స్టీలు, హార్డ్‌వేర్,
ఎలక్ట్రికల్ దుకాణాలతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించి పనిముట్లు,
స్పేర్ పార్టులు, ట్రాక్టర్లు, విత్తన, ఎరువులు, పురుగు
మందులు తదితర దుకాణాలు తెరుస్తాం.
0 Komentar