తెలంగాణ లో
టెన్త్ పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో టెన్త్
పరీక్షలను జూన్ మొదటివారం తర్వాత టెన్త్ పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు
స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులపై జూన్ 3న సమీక్ష నిర్వహించి నివేదిక
సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. అప్పటికీ కేసుల తీవ్రత పెరిగితే పరిస్థితులను
బట్టి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు
వెల్లడించింది. పరీక్షలు నిర్వహిస్తే కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని,
పరిస్థితి తీవ్రంగా ఉంటే పరీక్షలు నిర్వహించవద్దని న్యాయస్థానం
సూచించింది.
0 Komentar