దశల వారీగా పాఠశాలలను
తెరిచే యోచనలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ
కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో
పాఠశాలలను దశల వారీగా తెరవాలని విద్యాశాఖ యోచిస్తోంది. 10వ తరగతి పరీక్షలు జులై 5వ
తేదీ తో ముగియనుండగా ఆ తర్వాత పాఠశాలలు తెరవాలని భావిస్తున్నది. దశల వారీగా అనగా తొలుత
8, 9,
10 తరగతులు తర్వాత 6, 7 తరగతులు అటు తరువాత ప్రాథమిక
పాఠశాలలను మొదలు పెట్టే ఆలోచన చేస్తున్నది. మొదట కొద్ది రోజులు ఉపాధ్యాయులు
విధులకు హాజరై పాఠశాలలను సన్నద్ధం చేసేటట్లు చూడనున్నది. విద్యాసంభంద విషయాలు
చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఉపాధ్యాయ
ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించనున్నారు. మొత్తానికి జాతీయ విద్యా పరిశోధన,
శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) మార్గదర్శకాలు జారీ అయిన తర్వాతే తుది
నిర్ణయం తీసుకోవాలనిభావిస్తున్నారు.
0 Komentar